Pooja Hegde: టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు స్పెషల్ పాత్ర పోషించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పూజా హెగ్డే తెలుగు తమిళ్ హిందీ భాషలలో నటిస్తూ తన అందంతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. ఇదిలా ఉండగా పూజా హెగ్డే సమంత బాటలో వెళుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న “యానిమల్” సినిమాలో నటిస్తోందని సమాచారం.
అర్జున్ రెడ్డి సినిమా ద్వారా సెన్సేషనల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంపత్ రెడ్డి రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న” యానిమల్ “సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాని రెండుసార్లు తీసి నేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. సంపత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పరిణితి చోప్రా కథానాయిక పాత్రలో నటించనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సినిమా యూనిట్ పూజా హెగ్డేని సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ నటించి పూజా హెగ్డే మంచి గుర్తింపు పొందింది.
రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి పూజా హెగ్డే ఒప్పుకుందో.. లేదో.. చూడాలి మరి. అయితే ఇటీవల సమంత కూడా పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేయటంతో పూజా హెగ్డే కూడా సమంతని అనుసరించాలని అనుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తో పాటు అనిల్ కపూర్ ,త్రిప్తీ డిమ్రీ , పరిణితి చోప్రా తది తరులు నటిస్తున్నారు.
