Home Andhra Pradesh విశాఖలో రసవత్తమైన రాజకీయం

విశాఖలో రసవత్తమైన రాజకీయం

 విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖ జిల్లా రాజకీయాలు ఎప్పటికి ప్రత్యేకమైనవే, ముఖ్యంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా ప్రకటించటంతో విశాఖ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం పొందిన కానీ విశాఖలోని నాలుగు దిక్కులా విజయం సాధించింది. అయితే ఆలా గెలిచిన వాళ్ళు టీడీపీని అంటిపెట్టుకొని వుంటారనే నమ్మకం లేదు.

Ganta Ganababu Telugu Rajyam

  ముఖ్యంగా గంట శ్రీనివాస రావు , గణబాబు ఇద్దరు కూడా రేపోమాపో వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గంట శ్రీనివాస రావు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు నాలుగు సార్లు ముహూర్తం కూడా పెట్టుకొని మళ్ళి వెనక్కి తగ్గాడు. ఈసారి మాత్రం కచ్చితంగా వైసీపీ లో చేరటం ఖాయమనే మాటలు కూడా వినవస్తున్నాయి. మరో ఎమ్మెల్యే గణబాబు సైతం టీడీపీ నుండి వైసీపీకి వెళ్ళటానికి సిద్ధంగా వున్నాడు. వైసీపీ అధినేత సీఎం జగన్ పెట్టిన కండీషన్ వీళ్ళకి శాపం అయ్యింది. తమ పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనీ చెప్పటంతో వీళ్ళు వెనకడుగు వేస్తున్నారు. పార్టీ మారాలి అనుకునే నేతలు తమ తమ కుటుంబ సభ్యులతో వెళ్లి సీఎం జగన్ కలిసి వాళ్ళకి వైసీపీ కండువా కప్పించి, వీళ్ళు మాత్రం బయట నుండి మద్దతు ఇవ్వటం చేస్తున్నారు. గంట శ్రీనివాస రావు, గణబాబులు కూడా అదే పద్దతి ఫాలో అయ్యే అవకాశం వుంది.

 ఒకవేళ సీఎం జగన్ కచ్చితంగా రాజీనామా చేయాలంటే ఏమి చేయాలనే ఆలోచనలో వున్నారు. VMC ఎన్నికలు అయ్యేదాకా చూసి ఆ తర్వాత అవసరం అనుకుంటే రాజీనామా చేయాలనీ భావిస్తున్నారు. వైసీపీ పార్టీ విశాఖలో బలమైన గంట, గణబాబులను పార్టీలోకి చేర్చుకొని విశాఖ మున్సిపల్ ఎన్నికల పీఠంపై తమ పార్టీ జెండాను ఎగురవేయాలని చూస్తుంది. అందుకే విశాఖలో పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తుంది. ఇదే సమయంలో టీడీపీలోని కొందరు గంట శ్రీనివాస రావు, గణబాబులు ఎప్పుడు పార్టీని విడిపోతారా అని ఎదురు చూస్తున్నారు. విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీ వీడి వైసీపీ లో చేరటంతో ఆ నియోజకవర్గ బాధ్యతలను బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ చూసుకుంటున్నాడు. అదే దారిలో గంట, గణబాబులు వెళ్ళిపోతే ఆయా నియోజకవర్గాల్లో తమ పట్టు పెంచుకోవచ్చని కొందరు టీడీపీ నేతలు చూస్తున్నారు.

 

- Advertisement -

Related Posts

భక్తితో ఇచ్చిన కానుకను తిరస్కరించారని ప్రభుత్వం మీద అశోక్ గజపతి రాజు ఫైర్

ఆంధ్రప్రదేశ్: విజయనగరం జిల్లాలో గజపతి రాజులు గురించి, చెప్పాల్సిన పని లేదు. ఆ కుటుంబం త్యాగాల ముందు, ఇందిరా గాంధీ లాంటి నేత కూడా గౌరవంగా తల వంచి నమస్కారం పెట్టారంటే, ఆ...

మారవయ్యా జగనూ. మళ్ళీ కోర్టు టిడితే తిట్టింది అంటావు

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాలు నాయకలు ప్రజల యొక్క సమస్యల గురించి తప్ప అన్నింటి గురించి చర్చిస్తున్నారు, పోరాడుతున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో...

వీర్రాజు ఆవేశంతో అభాసు పాలైన బీజేపీ ? ఇది చెయ్యకూడని తప్పు ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ జెండాను పాతడానికి బీజేపీ నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ కు చుక్కలు...

ఒక పక్క వ్యాక్సీన్ వేస్తుంటే – సడన్ గా భారీ ట్విస్ట్ ?

కరోనా వ్యాధికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. మొదట ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ముందుగా టీకాలు తీసుకునేవారితో మాట్లాడి.. నాలుగు మంచి మాటలు...

Latest News