జనసేన పార్టీని స్థాపించి సరికొత్త రాజకీయాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన ఇతర నాయకులతో పోలుస్తున్నారు. మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన ఎల్జీపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ తో పవన్ ను పోలుస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో చిరాగ్ కూడా 243 స్థానాల్లో పోటీ చేశారు, కానీ కేవలం ఒకేఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించారు. చిరాగ్ ఎంపీగా ఉండటం వల్ల ఎక్కడ పోటీ చేయలేదు.
సినిమాల్లో నుండి రాజకీయాల్లోకి
దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ వారసుడి హోదాలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు అంతకుముందు హీరోగా ఓ సినిమాలో నటించారు సినిమాల్లోనే సెటిలైపోదామని అనుకుంటే సాధ్యం కాలేదు మొదటి సినిమానే దారుణంగా ఫెయిల్ అవ్వటంతో తర్వాత మరెవరు ధైర్యం చేసి చిరాగ్ ను హీరోగా పెట్టి సినిమాలు తీయలేదు. దాంతో వేరే దారిలేక చివరకు రాజకీయాల్లోకి వచ్చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల్లో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. కానీ ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లు, ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో చిరాగ్ కూడా కేవలం 5% మాత్రమే.
చిరాగ్ కు అంత సీన్ ఉందా!!
పవన్ కళ్యాణ్ సినిమాల్లో సూపర్ స్టార్ కానీ ప్రజలకు సేవ చెయ్యాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి ముఖ్యమైన కారణాల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇలాంటి ఆదర్శవంతమైన ప్రజా నాయకుడితో చిరాగ్ తో పోల్చడం సరికాదని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చ కానీ ప్రజల్లో సీఎంపై కంటే కూడా పవన్ కళ్యాణ్ పై ఉన్న నమ్మకం చాలా ఎక్కువ. అలాగే పవన్ కు రాజకీయంగా మద్దతుగా కూడా ఎవ్వరు లేరు. కేవలం ఒక్కడే పార్టీని న్నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు.