రాజకీయాల్లో కొన్నాళ్లగా కొండా దంపతులు సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ హయంలో రాజకీయాల్లో చక్రం తిప్పిన జంట తర్వాత జగన్ కు అండగా నిలబడ్డారు. మహబూబా బాద్ లో తెలంగాణ శ్రేణులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించడానికి కూడా వెనుకాడదలేదంటే? వైఎస్ అంటే ఎంత అభిమానమో మరోసారి అర్ధమయ్యేలా చేసారు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నడుమ జగన్ ని వదిలి గులాబీ గూటికి చేరారు. తెరాసా తీర్ధం పుచ్చుకున్న జంట కొన్నాళ్లు దూకుడు ప్రదర్శించారు. జిల్లా రాజకీయాల్లో సురేఖ మరోసారి ఫైర్ బ్రాండ్ గా నిలిచారు. అయితే ఆ తర్వాతి కాలంలో కేసీఆర్ తో విబేధాలు రావడంతో గులాబీ కి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లో చేరి పోటీ బరిలో నిలిచారు. కానీ కేసీఆర్ దాటిని తట్టుకుని నిలబడ లేకపోయారు. అప్పటి నుంచి కొండా జంట పేరు ఎక్కడా వినిపించలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ సన్యాసం తీసుకున్నారా? అని కూడా ప్రచారం సాగింది. కేసీఆర్ వ్యతిరేక వెబ్ మీడియా కొండా జంట గురించి ఆసక్తి కర కథనాలు వేడయం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా కొండ జంట యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. వరంగల్ రాజకీయాల్లో మళ్లీ తమ మార్క్ వేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. అందుకు వరంగల్ మేయర్ ఎన్నికల్ని టార్గెట్ చేసి పావులు కదుపుతున్నట్లు సమాచారం.
గులాబీ గ్యాంగ్ ని పడగొట్టి కొండా దంపతుల సత్తా ఎంటో చాటి చెప్పాలని పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గులాబీ అడ్డాగా మారిన వరంగల్ ని హస్తగతం చేసి కొండా మార్క్ వేయాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇన్ సైడ్ జోరుగా టాక్ వినిపిస్తోంది. తూర్పు నియోజక వర్గంలో తమ అనుచరులను రంగంలోకి దింపి గెలిపించి సత్తా చాటాలని కసితో ముందుకు కదులుతున్నట్లు తెలిసింది. కొండా జంట యాక్టివ్ తో జిల్లాలో, స్థానికంగా కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉరకలేస్తుందని సమాచారం.