Car- Child: కారులో ఉండిపోయిన చిన్నారి.. అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసిన పోలీసులు .. చివరికి ఇలా!

Car- Child: ప్రస్తుత కాలంలో మార్కెట్లోకి ఎన్నో రకాల బొమ్మలు అందుబాటులోకి వస్తున్నాయి అయితే ఈ బొమ్మలో నిజమైన బొమ్మలను కనుగొనడం చాలా కష్టతరంగా మారింది. ఇలా బొమ్మలు కూడా అచ్చం మనుషులని పోలి ఉండటంతో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన యూకేలోని క్లీవ్‌ ల్యాండ్‌ జరిగింది. ఏం జరిగింది అనే విషయానికి వస్తే…

అమీ క్విల్లెన్‌ అనే మహిళ.. తన కూతురు డార్సితో కలిసి షాపింగ్ కి వెళ్ళింది. అయితే ఎంతో ఇష్టమైన బొమ్మను కారు ముందు సీట్లో కూర్చో బెట్టి తన తల్లితో కలిసి షాపింగ్ కి వెళ్ళారు. ఇక తన కారు పక్కనే మరొక వ్యక్తి కార్ పార్క్ చేయడం కోసం వచ్చి సీట్లో చిన్నారి ఉండటం గమనించారు. అది చూసిన ఆ వ్యక్తి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు చేరవేశారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఆ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేశారు.

దీంతో పోలీసులు కారు అద్దాలను పగులగొట్టి ఆ చిన్నారిని కాపాడాలని ఏకంగా కారు అద్దాలు పగలగొట్టారు. కారు అద్దాలు పగులగొట్టిన తర్వాత పోలీసులు షాక్ కి గురయ్యారు. కారులో ఉన్నది చిన్నారి కాదు చిన్నారిని పోలి ఉన్న బొమ్మ అని తెలియడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఇక అదే సమయానికి అక్కడికి అమీ క్విల్లెన్‌ తన కూతురుతో కలిసి వచ్చింది. అసలేం జరిగిందనే విషయాన్ని పోలీసులు చెప్పారు. ఆ బొమ్మ అంటే తన కూతురుకి ఎంతో ఇష్టం అని అందుకే క్రిస్మస్ కానుకగా తన కూతురికి ఈ బొమ్మ బహుమతిగా ఇచ్చానని తెలిపారు. దీంతో పోలీసులు చేసిన పొరపాటుకు తన కారు మరమ్మతు కోసం డబ్బులు చెల్లిస్తామని వెల్లడించారు.