దుబ్బాక లో రణ రంగం గా మారిన రాజకీయం … తోపులాటలో బండి సంజయ్ కి స్వల్ప గాయాలు ,

police arrest BJP president Bandi Sanjay

దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నుంచి దుబ్బాక బరిలోకి దిగిన రఘునందన మామ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. సిద్ధిపేటలో రఘునందన మామ ఇంట్లో రెవెన్యూ, పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.18.67 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద మొత్తంలో డబ్బులు పట్టు పడడంతో పోలీసులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం తో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

police arrest BJP president Bandi Sanjay
police arrest BJP president Bandi Sanjay

దీంతో విషయం తెలుసుకున్న వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సిద్దిపేట కు బయల్దేరారు. దాడి జరిగిన కుటుంబసబ్యులను కలవడానికి సిద్దిపేటకు బయలుదేరిన బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు ఆయనను గట్టిగా పోలీస్ వ్యాన్‌లోకి నెట్టడంతో పలు గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గట్టిగా అరుపులు కూడా పెట్టారు. సంజయ్ ని సిద్దిపేట నుంచి కరీంనగర్ కి తీసుకెళ్తున్నారు. అప్రజాస్వామికంగా తెలంగాణ పోలీసులు దుబ్బాక నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న రఘునందన్ రావు బంధువుల కుటుంబాలపై దాడి చేసి, సోదాలు చేయడం తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు బండి సంజయ్.

దుబ్బాక శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు,సోదాలు చేయడం ఎన్నికల నియమావాళికి విరుద్ధమని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం దుందుడుకు చర్యన్నారు. సిద్దిపేటలో దాడులు, సోదాలు ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. మరోవైపు బీజేపీ ముఖ్యనేతలు కూడా సిద్ధిపేటకు చేరుకుంటున్నారు.