ప్రధాని మోదీ తాజాగా మార్కెట్ లోకి 75 రూపాయల నాణెన్ని విడుదల చేశారు. ఇటీవలే ప్రధాని మోదీ.. 100 రూపాయల నాణెన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా 75 రూపాయల నాణెన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ విడుదల చేశారు.
గత సోమవారం రాజమాత విజయ స్కిందియా జయంతి సందర్భంగా మోదీ 100 రూపాయల కాయిన్ ను తీసుకురాగా… తాజాగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచే ఎఫ్ఏవో వార్షికోత్సవం సందర్భంగా 75 రూపాయల కాయిన్ ను విడుదల చేశారు.
భారత్, ఐక్యరాజ్యసమితి మధ్య దీర్ఘకాల సంబంధాలకు ఈ నాణెం ఒక సంకేతంగా మిగిలిపోవాలని… మోదీ ఆకాంక్షించారు. 75 రూపాయల కాయిన్ ను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్కెట్ లోకి విడుదల చేశారు. దానికి సంబంధించిన వీడియోను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
Addressing the programme marking 75th anniversary of @FAO. #SahiPoshanDeshRoshan https://t.co/aCUbwedDpb
— Narendra Modi (@narendramodi) October 16, 2020