కరోనా వల్ల మీ వ్యాపారం దెబ్బతిన్నదా? అయితే కేంద్రం నుంచి 10 లక్షల సాయం పొందండి.. ఇలా అప్లయి చేసుకోండి

pm mudra yojana loan to start new business

కొత్త బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? లేదా కరోనా కారణంగా ఉన్న బిజినెస్ వల్ల నష్టపోయారా? పెట్టుబడి పెట్టాలంటే చేతిలో చిల్లిగవ్వ లేదా? ఎలాగైనా వ్యాపారంలో నిలదొక్కుకోవాలని చూస్తున్నారా? అయితే మీకోసమే కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన స్కీమ్ ను ప్రారంభించింది. పదండి.. దాని గురించి తెలుసుకుందాం..

pm mudra yojana loan to start new business
pm mudra yojana loan to start new business

అది ఏవ్యాపారమైనా.. చిన్నది కానీ.. పెద్దది కానీ.. ముందు కావాల్సింది పెట్టుబడి. పెట్టుబడి లేకుండా ఏ వ్యాపారాన్ని కూడా ప్రారంభించలేం. అందులోనూ ఇది కరోనా కాలం. ఏ వ్యాపారం ప్రారంభించాలన్నా భయమే. ఇప్పటికే ప్రారంభించిన వ్యాపారాలన్నీ ఢీలా పడిపోయాయి. బిజినెస్ లేక వ్యాపారస్తులు ఎంతో నష్టపోయారు.

అటువంటి వాళ్ల కోసమే కేంద్ర ప్రభుత్వం పీఎం ముద్ర యోజన అనే స్కీమ్ ను ప్రారంభించింది. దీన్నే పీఎంఎంవై అని అంటారు. ఈ పథకంలో శిశు లోన్, కిషోర్ లోన్, తరుణ్ లోన్ అని మూడు రకాలు ఉంటాయి.

ఒక్క శిశు లోన్ కోసమే 1500 కోట్లు కేటాయించామని కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు.

ముద్ర స్కీమ్ కింద లోన్ తీసుకున్నవాళ్లకు 2 శాతం వరకు వడ్డీలో తగ్గింపు కూడా వర్తిస్తుంది. ఈ పథకం కింద సుమారు 3 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.

ఈ పథకం కింద 50 వేల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తారు. శిశు లోన్ కింద 50 వరకు లోన్ ఇస్తారు. కిషోర్ లోన్ లో 50 వేల నుంచి 5 లక్షల వరకు, తరుణ్ లోన్ లో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ లభిస్తుంది.

ఈ లోన్ కింద అప్లయి చేసుకోవాలనుకునే వాళ్లు.. ఏదైనా బ్యాంక్ ను సంప్రదించవచ్చు. లేదంటే www.mudra.org.in వెబ్ సైట్ కు లాగిన్ అయి వివరాలు తెలుసుకోవచ్చు. ముద్ర లోన్ కోసం ఆన్ లైన్ దరఖాస్తును కూడా సమర్పించవచ్చు.

ముద్ర పథకం కింద రుణం పొందడానికి ఆధార్ కార్డు, వ్యాపారం పేరు, అడ్రస్, ఫోటో, వ్యాపారం కోసం కొనుగోలు చేసే యంత్రాల కొటేషన్ ఉంటే చాలు. దేశంలోని అన్ని ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకుల నుంచి కూడా ముద్ర లోన్ ను పొందొచ్చు.