ఒకే ఒక్క మాటతో బాబుకు ప్రాణం పోసిన మోడీ

modi chandrababu

 ప్రధాని మోడీ రాజ్యాంగ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా గుజ‌రాత్‌లో శుక్ర‌వారం జ‌రిగిన శాస‌న వ్య‌వ‌హారాల ప్రిసైడింగ్ అధికారుల స‌ద‌స్సులో ప్ర‌ధాని కీల‌క ఉప‌న్యాసం ఇచ్చారు. ఇందులో భాగంగా జమిలి ఎన్నికల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు, జ‌మిలి ఎన్నిక‌లు భార‌త్‌కు ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు. ఇది చ‌ర్చ‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసే అంశం ఎంత మాత్రం కాద‌న్నారు. వేర్వేరు చోట్ల కొన్ని నెల‌ల‌కు ఒక‌సారి ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం వ‌ల్ల అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌భావం చూపుతున్నాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే అని చెప్పుకొచ్చారు. వీటి కోసం డ‌బ్బు, స‌మ‌యం ఎందుకు వృథా చేసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

modi chandrababu

 ప్రధాని నోటి నుండి జమిలి అనే పదం రావటం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ప్రాణం పోసిందనే చెప్పాలి. 2019 ఎన్నికల్లోఘోర ఓటమి చవిచూసిన చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత పార్టీని కాపాడుకోలేక కింద మీద పడుతున్నాడు, వరసగా టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు జైలుకి వెళ్లి వస్తున్నారు, మరోపక్క టీడీపీ లో ఆర్థికంగా బిగ్ షాట్స్ యొక్క ఆస్తుల మీద వైసీపీ సర్కార్ కొరడా రుళిపిస్తున్నారు,దీనితో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. చంద్రబాబును చూస్తే కరోనా భయంతో కేవలం వీడియో కాన్ఫిరెన్స్ లకు పరిమితం అయ్యాడు. లోకేష్ బాబు ఒక ఐదారు రోజులు హడావిడి చేసి, ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు.

 దీనితో రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. క్యాడర్ పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో మోడీ నుండి జమిలి ఎన్నికలు ప్రస్తావన రావటంతో దానిని హైలైట్ చేస్తూ, రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని, జ‌గ‌న్‌ను ఓడిస్తామ‌నే నినాదంతో టీడీపీ శ్రేణుల్లో మ‌నోస్థైర్యం నింపేందుకు బాబు మరియు అతని ఎల్లో మీడియా జమిలి పదాన్ని గట్టిగానే ఉపయోగించుకునే అవకాశం ఉంది. టీడీపీ పార్టీని ముందుకు నడిపించటానికి జమిలి ఎన్నికలు ఇప్పుడు ఆక్సిజన్ లాగా మారిపోయిందని చెప్పాలి. ఇక ఇప్పటి మొదలు పచ్చ మీడియాలో జై జై జమిలి అనే నినాదాలు దర్శనం ఇవ్వటం ఖాయం