PM Kisan Yojna: రేపు రైతుల ఖాతాల్లో డబ్బుల జమ

PM Kisan Yojna: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM – KISAN) పథకం కింద రేపు రైతుల ఖాతాల్లో రూ. 2వేలు జమకానున్నాయి. ఈ మేరకు శనివారం ఉదయం వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ప్రధాని మోదీ.. కిసాన్ నిధులను విడుదల చేస్తారని PMO పేర్కొంది. ఈ పథకంలో భాగంగా ఏటా రూ. 6వేలు మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున నాలుగు నెలలకొకసారి కేంద్రం రైతులకు అందిస్తోంది.

ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో.. పి ఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసినట్లు. జనవరి 1వ తేదీ నుంచి పదో విడత డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యం తోనే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. కాగా ఈ పథకం కింద కేంద్రం ఏటా రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు జమ చేస్తోంది దీనివల్ల దేశ వ్యాప్తం గా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇక ఈ పథకం డబ్బులను https://pmkishan.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.