మేన కోడలిపై ఏడు నెలలుగా అత్యాచారం చేసిన మామ.. ఆపై గర్భం దాల్చడంతో అలా?

 

ప్రస్తుత సమాజంలో ఆడవారికి రక్షణ అనేది కరువవుతోంది. ఆడవారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రానురాను అయితే ఇంట్లో మనుషులను కూడా నమ్మడానికి కూడా లేదు. వావివరుసలు మరచి తండ్రి కూతురిని, అన్నా చెల్లెలిని అత్యాచారాలు చేయడం ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీనితో ఆడవాళ్లు పరిస్థితి ఇంట బయట ఒకటే విధంగా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా అక్క కూతురిపై మేనమామ దాదాపుగా 7 నెలలుగా అత్యాచారం జరిపి ఆ బాలిక గర్భం దాల్చడంతో తొలగించి, ఆపై ఆ బాలికపై హత్యా ప్రయత్నం కూడా చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జల్ పల్లి పురపాలిక కు చెందిన ఒక మహిళ కు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ మహిళ భర్త మద్యానికి బానిసై ఆమెను ఇంటి నుంచి పదేళ్ల క్రితమే వెళ్లగొట్టాడు. దీంతో ఆమె తన పిల్లలతో పుట్టింటికి చేరింది ఇల్లల్లో పాచి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ వస్తోంది. పుట్టింట్లో తన తల్లి తోడబుట్టిన ఇద్దరు సోదరులు అండగా ఉన్నారనే ధైర్యం గా ఉండేది. అయితే తొమ్మిది నెలల క్రితం ఒక రోజు ఆ మహిళ పెద్ద కుమార్తెను ఆమె తల్లి దగ్గరకు వెళ్ళకుండా తన అమ్మమ్మ ఆపింది. కొద్దిరోజుల తర్వాత అనారోగ్యంగా ఉందని కూతురు తల్లి వద్దకు వచ్చి చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ బాలిక మేనమామ తనపై 7 నెలలుగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు అని తెలియగానే ఆ బాలిక తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఆ బాలిక గర్భం దాల్చిన సమయంలో తన అమ్మమ్మ, మేనమామ కలిసి బలవంతంగా ఆ బాలికను ఆసుపత్రికి తీసుకు వెళ్లి గర్భాన్ని తొలగించారు. ఆ తర్వాత తల్లి పిల్లల్ని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఆ మహిళ తన కూతురికి జరిగిన వైద్యం గురించి రెండు నెలల క్రితమే బాలాపూర్ పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి ఒకరిని రిమాండ్ కు తరలించారు. ఇక పోలీసులు కూడా ఆమెకు న్యాయం చేయలేదని భావించి అంజుదుల్లా ఖాన్ ను ఆశ్రయించింది. దీనితో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ను కలిసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని అతను తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడు అయినా వ్యక్తిని నెలల క్రితమే రిమాండ్ కు తరలించామని బాలాపూర్ ఇన్ స్పెక్టర్ భాస్కర్ తెలిపారు. ఆ మహిళ తల్లి,సోదరుడు తప్పించుకొని తిరుగుతున్నారని స్పష్టం చేశారు.