Keerthy Suresh: అంకుల్ అని పిలిస్తే మర్యాదగా ఉండదు… కీర్తి సురేష్ కు వార్నింగ్ ఇచ్చిన హీరో?

Keerthy Suresh: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఇటీవల తన మొదటి బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.

ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ఇటీవల తన ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. దాదాపు 15 సంవత్సరాల పాటు ఆంటోని అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నటువంటి కీర్తి సురేష్ గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ గోవాలో ఎంతో ఘనంగా హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తనకు ఒక హీరో చిన్న వార్నింగ్ ఇచ్చిన సంగతి బయటపెట్టారు. తనని అంకుల్ అని పిలవద్దు అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్టు కీర్తి సురేష్ తెలిపారు.

మరి కీర్తి సురేష్ కు ఇలాంటి వార్నింగ్ ఇచ్చిన హీరో ఎవరు అనే విషయానికి వస్తే… ఈమెకు ఇలాంటి వార్నింగ్ ఇచ్చినటువంటి హీరో మరెవరో కాదు మలయాల నటుడు దిలీప్. 2002లో దిలీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం కుబేరన్‌. ఇందులో అతడు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు. అందులో ఒకరు కీర్తి సురేశ్‌. దిలీప్‌ కూతురిగా నటించిన కీర్తి.. తర్వాతికాలంలో అతడి ప్రేయసిగా నటించింది.

రింగ్ మాస్టర్ సినిమా 2014వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందులో కీర్తి సురేష్ ఆయనకు గర్ల్ ఫ్రెండ్ గా నటించారు. ఇలా ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ హీరో కీర్తి సురేష్ ని పిలిచి ఓ మాట చెప్పారు. చిన్నప్పుడు అంకుల్‌ అని పిలిచేదాన్నని.. అలా మాత్రం పిలవొద్దని కోరాడు. కావాలంటే చేట్ట (అన్నయ్య) అని పిలవమన్నాడు అంటూ కీర్తి సురేష్ ఈ సందర్భంగా అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.