ప్రతి సంవత్సరం ఉత్కంఠను రేపే బాలాపూర్ వినాయకుడి లడ్డూ … వేలంలో ఈ సారి కూడా రికార్డు ధర పలికింది. బాలాపూర్ మండలానికి చెందిన ఆర్యవైశ్యసంఘం 16 లక్షల 60 వేల రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకుంది. ఆర్యవైశ్య సంఘం తరపున సంఘం ప్రతినిధి శ్రీనివాస్ గుప్తా లడ్డూను అందుకున్నాడు. 30 మంది ఈ వేలం పాటలో పాల్గొనగా దాదాపు అరగంట పాటు లడ్డు వేలం ఉత్కంఠగా సాగింది.
1994 నుంచి బాలాపూర్ లడ్డు వేలం జరుగుతుంది. ప్రతిసారి కూడా తెలుగు రాష్ట్రాలు బాలాపూర్ లడ్డు వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. మిగతా ప్రాంతాలలో ఎక్కువ ధరలకే లడ్డులు వేలం అయినా కూడా బాలాపూర్ వేలానికి ఒక ప్రత్యేకత ఉంది. కోరుకున్న కోరికలు నేరవేరుతాయనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూ కోసం అనేక మంది పోటి పడుతారు.
1994 లో మొదటి సారి బాలాపూర్ లడ్డూను కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ధర పెరుగుతూ వస్తూ ఉంది. 2017 లో 15.60 లక్షలకు నాగం తిరుపతి రెడ్డి దక్కించుకున్నాడు. ఈ సారి లక్ష రూపాయలు ఎక్కువగా శ్రీనివాస్ గుప్తా 16.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు.
బాలపూర్ గణేష్ ఉత్సవ సమితి 1994లో ఏర్పడింది.
1994 సంవత్సరం కోలన్ మోహన్ రెడ్డి 450/- తో ప్రారంభమైన బాలాపూర్ గణేష్ లడ్డూ ఇరవై నాలుగు సంవత్సరాలలో 15 లక్షల 50 వేల వరకు పలికింది. ఎంతో కలిసొస్తుందని నమ్మకంతో భక్తులు ఏటా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటలో పాల్గొన్ని కైవసం చేసుకుంటున్నారు… అత్యధికం గా 8 సార్లు బాలాపూర్ గ్రామానికి చెందిన కోలన్ కుటుంబీకులు వేలం పాటలో లడ్డు కైవసం చేసుకున్నారు…
1) కోలన్ మోహన్ రెడ్డి 450/ – 1994
2 కోలన్ మోహన్ రెడ్డి 4500/ -. 1995.
3)కోలన్ కృష్ణారెడ్డి 18000 /-. 1996.
4)కోలన్ కృష్ణారెడ్డి 28000/- 1997.
5) కోలన్ మోహన్ రెడ్డి 51000/ – 1998.
6) కళ్ళెం ప్రతాప్ రెడ్డి 65000/- 1999.
7) కళ్ళం అంజి రెడ్డి 66000/- 2000.
8)G. రఘునందన్ చారి 85000/- 2001.
9) కందాడ మాధవరెడ్డి 105000/- 2002.
10) చిగురంత బాల్ రెడ్డి 1,55000/- 2003.
11) కోలన్ మోహన్ రెడ్డి 2,01000 2004.
12) ఇబ్రహీం శేఖర్ 2,08000 2005.
13)చిగురంత తిరుపతి రెడ్డి 300000 2006.
14)G.రఘునందన్ చారి 4,15000/- 2007.
15) కోలన్ మోహన్ రెడ్డి 5,07000/- 2008.
16) సరిత 510000/- 2009.
17) కోడలి శ్రీధర్ బాబు 535000/- 2010.
18) కోలన్ బ్రదర్స్ 545000/- 2011.
19)పన్నాల గోవర్ధన్ 750000/- 2012.
20)తీగల కృష్ణ రెడ్డి 926000/- 2013.
21) సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 950000/- 2014.
22)కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 1032000/- 2015.
23) స్కైల్యాబ్ రెడ్డి 14,65000 /- 2016.
24) నాగం తిరుపతి రెడ్డి 1560000 /- 2017.
25) 16.60000 /- లక్షలు రూపాయలు పలికిన శ్రీనివాస్ గుప్తా.