రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే మూడు రాజధానుల అంశంలో కోర్ట్ లో ఉన్నప్పటికీ త్వరలో అన్ని అడ్డంకులను దాటుకుని మూడు రాజధానులు ఏర్పడుతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. త్వరలో రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా మారనున్న విశాఖ పట్నానికి ఇప్పుడే పెట్టుబడులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నాయి.
మాంచి బీచ్ తో విశాఖపట్నం ఇప్పుడే పర్యాటకులను ఆకర్షిస్తుంది. విశాఖకు కూల్ సిటీ, మెగా సిటీ అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు విశాఖకు ఒక పెద్ద ముప్పు ఉందని నేరుగా కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది. అయితే ఇలా రానున్న ప్రమాదం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ మేధావులు ముందే హెచ్చరిస్తున్నారు.
ఏమిటా ప్రమాదం!
ఆ రానున్న ప్రమాదం ఏంటంటే మావోయిస్టులు. ఏపీలో ఉన్న పదమూడు జిల్లాలలో తూర్పు గోదావారి తరువాత భౌగోళికంగా పెద్దది. పైగా ఏజెన్సీ ప్రాంతం కూడా ఎక్కువ. దాంతో వామపక్ష తీవ్రవాదం విశాఖ జిల్లాకు అతి పెద్ద సమస్యగా ఉంది. ఒడిషా నుంచి విశాఖ వరకూ ఉన్న ప్రాంతం మావోలకు పట్టుకొమ్మగా చెబుతారు. ఇపుడు కేంద్రం కూడా మరోసారి విశాఖకు ఆ ముప్పు ఉందని నివేదిక ఇచ్చింది. ఇప్పటికే భద్రతా పరమైన ఏర్పాట్ల కోసం కేంద్రం రూ. 95కోట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే విశాఖను వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతంగా పరిగణిస్తూ కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరికలు జారీ చేసింది.
మావోల కదలికలు కనిపిస్తున్నాయా!
ఈమధ్యనే ఒడిశా- ఆంధ్ర బోర్డర్ మద్య అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందులో మావోల కదలికలను అధికారులు గుర్తించారు. అలాగే ఇప్పటికే ఆంధ్రాలోని ఒక మంత్రికి మావోల ప్రమాదం ఉందని కేంద్ర భద్రతా అధికారులు ఆ మంత్రికి రక్షణ బలగాన్ని కూడా పెంచింది. ఇలా ఉన్న మావోల తాకిడి రానున్న విశాఖను మరింత ప్రభావితం చేయనుంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి విశాఖకు పరిపాలన రాజధానిని తరలించేలోపు ఈ మావోల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. ఎందుకంటే రాజధానిని తరలించిన తరువాత ఏదైనా ప్రమాదం జరిగితే వైసీపీ జరిగే నష్టాన్ని ఆ పపార్టీ నేతలు కలలో కూడా ఊహించలేరు. అందుకే రాజధానిని తరలించే లోపు ఈ ప్రమాదం నుండి విశాఖను బయటపడేలా చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సూచిస్తున్నాయి.