కోవిడ్ చికిత్స: ప్లాస్మా థెరపీ ఔట్.. తర్వాతేంటి.?

Plasma Treatment Out,What About Remdesivir

అదిగో పులి.. అంటే, ఇదిగో తోక.. అన్న చందాన, మీడియా.. కరోనా వైరస్ విషయంలో ప్రజల్ని తీవ్రంగా భయపెట్టేస్తోంది. అదిగో మందు, ఇదిగో చికిత్స.. అంటూ అడ్డగోలు ప్రచారాలకు తెరలేపుతోంది. సోషల్ మీడియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక, గత కొద్ది కాలంగా ప్లాస్మా చికిత్స.. అంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. మొదటి వేవ్ సందర్భంగా ప్లాస్మా థెరపీకి పాపులారిటీ ఎక్కువైంది. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేస్తే, అది కరోనా కొత్తగా సోకినవారి చికిత్సలో ఉపయోగపడుతుందని నిన్న మొన్నటిదాకా వినిపించింది.చాలా వైద్య చికిత్సలు కూడా ఈ కోణంలో జరిగాయి.కొంతమంది కోలుకున్నారు కూడా.అయితే, ప్లాస్మా చికిత్స వల్ల అదనపు ప్రయోజనాలేమీ లేవని గత కొంతకాలంగా వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టేశాయి.

చివరికి కరోనా ప్రోటోకాల్ నుంచి ప్లాస్మా చికిత్సను ఐసీఎంఆర్ తొలగించింది. దాంతో, ‘ప్లాస్మా దానం’ చుట్టూ జరుగుతున్న ప్రచారాలు ఆగిపోతాయా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరిలో ప్లాస్మా చికిత్స బాగానే పనిచేస్తున్నా, వైరస్ మ్యుటేషన్లు ఎక్కువైపోయిన దరిమిలా, ప్లాస్మా చికిత్స వల్ల కొత్త సమస్యలు తలెత్తతున్నాయనీ, వైరస్ మరింత బలోపేతమవుతోందనీ కొందరు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, రెమెడిసివిర్ ఔషధం మాటేమిటి.? 3 వేల ధర గరిష్టంగా పలకాల్సిన ఈ మెడిసిన్ ధర బ్లాక్ మార్కెట్టులో 25 వేల నుంచి 60 వేల దాకా పలుకుతోంది. నిజానికి, రెమిడిసివిర్ వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు రెమిడిసివిర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.. దాన్ని వాడకూడదని. కానీ, మన దేశంలో రెమిడిసివిర్ ఔషధానికి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇదొక మార్కెటింగ్ ట్రిక్కు మాత్రమేనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కొత్తగా డిఆర్డీవో తెరపైకి తెచ్చని ‘2డిజి’ ఔషధం మీదనే ఆవలున్నాయి. అది త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. మరి, ఈ ఔషధం తాలూకు సమర్థత ఎంత.? ఏమో, వేచి చూడాల్సిందే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles