Pithapuram: పవన్ ఇలకాలో ఇసుక దందా… పవన్ కళ్యాణ్ కు ఝలక్ ఇచ్చిన వర్మ!

Pithapuram: పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ ఇటీవల జనసైనికులు ఎమ్మెల్సీ నాగబాబు కూడా పిఠాపురం గురించి మాట్లాడుతూ వచ్చారు అయితే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎంతో మంచి ప్రజాదరణ ఉంది ఏడాది కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని వర్మ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ చివరి క్షణంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితులలో వర్మతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు.. ఇలా పవన్ కళ్యాణ్ ని గెలిపించారనే మాటే తప్ప పిఠాపురంలో మాత్రం జనసేన వర్సెస్ టిడిపి అనే విధంగా నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పిఠాపురంలో జరుగుతున్న అక్రమాలు గురించి వర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ వచ్చారు..

తాజాగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దందా నిర్వహిస్తున్నట్లు వర్మ ఆధారాలతో సహా బయటపెట్టారు. ప్రతిరోజు రాత్రిపూట ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ పోలీసులకు మాత్రం పట్టడం లేదని పోలీసులు రేచీకటి సమస్యతో బాధపడుతున్నారని అందుకే అక్రమ దందా కనిపించడం లేదని విమర్శించారు. పోలీసులకు చేరాల్సిన మామూలు చేరుతున్నాయని అందుకే ముందస్తు సమాచారంతో పోలీసులే తప్పుకుంటున్నారని ఈయన పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిరోజు రాత్రి దాదాపు 300 లారీల వరకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు.ఇక్కడ ఇసుక దొంగతనం జరుగుతోందని చెబుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. 20 రోజులుగా ఈ విషయాలను పోలీసులకు చెబుతున్నా ఫలితం లేకుండా పోయిందని ఆయన తెలిపారు. రమణక్కపేటలో ఇసుక అక్రమ దందాకు కూడా శంకుస్థాపన జరిగింది అంటూ ఈయన సెటైర్లు వేశారు. మరి వర్మ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమౌతూ అక్రమ దందాలను అడ్డుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.