Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని చెప్పాలి. ఆయన మంత్రిగా ఉన్నటువంటి ఐదు శాఖల పై పవన్ కళ్యాణ్ ఎంతో దృష్టి సారిస్తూ అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అదేవిధంగా తనకు ఓట్లు వేసి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం పై కూడా ఈయన పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ తమకు మంచి చేస్తారన్న ఉద్దేశంతో అక్కడి ప్రజలు ఆయనకు భారీ మెజారిటీతో విజయం అందించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం ఎప్పటికప్పుడు పిఠాపురం నియోజకవర్గ సమస్యలన్నింటిని తెలుసుకుంటూ వెంటనే పరిష్కారం చూపడమే కాకుండా మరోవైపు అభివృద్ధికి కూడా బాటలు వేస్తున్నారు.
ఇకపోతే తాజాగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు – రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి.. పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ₹59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉంది.
ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చాను. సామర్లకోట- ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన పూర్తి అవుతే ప్రజల రాకపోకలు చాలా సులభతరం అవుతాయి. అలాగే ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు.. ఈ రహదారి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (CRIF) సేతు బంధన్ పథకంలో భాగంగా చేపట్టడమైనది. నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన నరేంద్ర మోడీ గారికి అభినందనలు అంటూ ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.