టీడీపీ ఫైర్ బ్రాండ్ బోండా ఉమా గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనించేవాళ్ళకి బాగానే తెలుసు. విజయవాడ కేంద్రంగా రాజకీయాలు చేసే బోండా ఉమా, జగన్ సర్కార్ మీద తనదైన శైలిలో విరుచుకుపడుతాడు. గతంలో టీడీపీ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆయనగారి “పెత్తనాలకు” అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇక అసలు విషయానికి వస్తే గత కొద్దీ రోజులుగా ఆయనకు సినీ పరిశ్రమకు ఉన్న కొన్ని సంబంధాలు బయటకు వస్తున్నాయి.
ముఖ్యంగా హీరోయిన్స్ తో బోండా ఉమకు దగ్గరి రిలేషన్ ఉందనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. వాటికీ బలం చేకూర్చే విధంగా ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో బోండా ఉమా, ఒక హీరోయిన్ ఇద్దరు కలిసి వెళ్తున్న ఫోటో బయటకు వచ్చింది. దీనితో బోండా ఉమా మాట్లాడుతూ ఆమె ఎవరో నాకు తెలియదని, ఇలాంటివి వైసీపీ వాళ్లే కావాలని క్రియేట్ చేసి, నా పరువు తీయటానికి చూస్తున్నారని, అలాంటివాళ్లను వదిలేది లేదని మాట్లాడటం జరిగింది. ఆయన దీని గురించి మాట్లాడకపోయినా ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదేమో..! బోండా ఉమా మాట్లాడేసరికి ఆ ఫోటో ట్రేండింగ్ అవ్వటం జరిగింది. సాధారణంగానే సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకు “చాలా” దగ్గరి సంబంధనలు ఉంటాయి. చాలా మంది నేతలు తమ అక్రమ సంపాదనను కొందరి నిర్మాతల ద్వారా సినిమాలపై పెట్టుబడులు పెడుతారు. ఆ క్రమంలో పరిచయాలు పెరగటం సహజమే..
హైదరాబాద్ లోని ఒక పెద్ద స్టార్ హోటల్ లో తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలకు ప్రత్యకమైన రూమ్స్ కేటాయించి ఉంటాయి. అందులో అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. వాటిగురించి పోలీసులకు సృష్టమైన సమాచారం ఉన్నకాని, అటువైపు కన్నెత్తి చూసే దైర్యం చేయలేరు. ఇక అనేక మంది హీరోయిన్స్ హైదరాబాద్ వస్తే వాళ్ళ మొదటి చాయిస్ అదే హోటల్. ఎందుకంటే అక్కడ జరిగే విషయాలు బాహ్య ప్రపంచటానికి పెద్దగా తెలిసే అవకాశం ఉండదు. అందుకే చాలా మంది నేతలు సినీ తారలు ఆ హోటల్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇక బోండా ఉమా విషయంలో కూడా ఆయనేదో పనిమీద లోపాలకి వెళ్లి బయటకు వస్తుందే, అదే సమయంలో హీరోయిన్ కూడా బయటకు వస్తుంటే ఎవరో హీరోయిన్ ను ఫోటో తీస్తే అందులో అనుకోకుండా బోండా ఉమా కనిపించాడు . అంతే తప్ప వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం లేదు.. నిజంగా బోండా ఉమాగారు అమాయకుడు, ఆయనకు ఎవరితో ఎలాంటి సంబంధాలు లేవు. ఒట్టు నమ్మితే నమ్మండి…లేకపోతె లేదు…. బోండా ఉమా ..ఒక హీరోయిన్..ఒక హోటల్ స్టోరీ ఇదే