మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Who Is Behindi Petrol Price Hike Conspiracy

 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్ళీ పెరిగాయి. ఐదు రోజుల్లో నాలుగో సారి చమురు సంస్థలు ధరలు పెంచాయి. దేశ వ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌ పై 89పైసలు, డీజిల్‌పై 86పైసలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా రెట్లను పెంచకపోవడంతో హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్‌ ఏకంగా రూ.16,875 కోట్లు ఆదాయాన్ని నష్టపోయినట్లు తెలుస్తోంది.

దేశంలో పలు నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.80 పైసలు , డీజిల్‌ ధర రూ.98.10గా ఉంది

విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.60 పైసలు, డీజిల్‌ ధర రూ.99.56 పైసలుగా ఉంది.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.61పైసలు, డీజిల్‌ ధర రూ.89.87 పైసలుగా ఉంది.

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.35పైసలుగా, ఉండగా డీజిల్‌ ధర రూ.97.55పైసలుగా ఉంది

చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.43పైసలు, డీజిల్‌ ధర రూ.94.47పైసలుగా ఉంది

బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.93 పైసలు, డీజిల్‌ ధర రూ.88.14పైసలుగా ఉంది