Video Viral: ఉక్రెయిన్ దేశం పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా దాడులు కొనసాగుతున్న కారణంగా ఉక్రెయిన్ భయానక వాతావరణం నెలకొంది. ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమని బతుకు పోరాటం సాగిస్తున్నారు. యుద్ధం సమయంలో ఎటునుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
A Ukrainian in Berdyansk spotted a mine on the road and didn’t wait around for a bomb disposal unit – at great risk to life and limb, he removed the mine, clearing the way for the Ukrainian military.#nucleaire #WARINUKRAINE #RussiaUkraineWar #worldwar3 pic.twitter.com/BbSfHA8DXe
— Indian Army Fan Club (@VaadeD) March 1, 2022
ఈ క్రమంలోనే కొందరు ఉక్రెయిన్ వారి దేశం కోసం సైనికులుగా మారి ప్రాణాలకు తెగించి మరీ పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. రష్యా బలగాల దాడిలో భాగంగా ఉక్రెయిన్ లోని బెర్దయాన్ స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలి అన్న ఉద్దేశంతో రష్యా సేనలు నడి రోడ్డుపై ఒక ల్యాండ్ లైన్ ను అమర్చారు. ఇక అటుగా వెళ్తున్న ఒక ఉక్రెయిన్ పౌరుడు అది చూసి రోడ్డుపై ఉన్న ల్యాండ్ మైన్ కు ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండానే దానిని పట్టుకుని దూరంగా వెళ్లి విసిరి పారేసాడు. అతడు చేసిన పనికి అందరూ అతడిని ప్రశంసిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.