మాజీ మంత్రి పేర్ని నాని.. తాజాగా మహానాడు నిర్వహించే అర్హత తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబానికి లేదని వ్యాఖ్యలు చేశాడు. మంత్రులు చేసే బస్సుయాత్ర మహానాడుకు పోటీ కాదని. వారు చేపట్టిన యాత్ర కృష్ణా జిల్లా గన్నవరం చేరుకుందని అన్నాడు. షెడ్యూల్ ప్రకారం 2024 లోనే వైకాపా ఎన్నికలకు వెళ్తుంది అని అన్నాడు. జగన్ ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు ఎలా వచ్చారో ఇప్పుడు కూడా అలాగే వస్తున్నారు అని అన్నాడు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరంలోనే సామాజిక న్యాయం కార్యరూపం దాల్చిందని.. గడిచిన ఎన్నికల్లో జగన్ 50 శాతం ఓట్లతో గెలుపొందారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని అన్నాడు. ఇక మిగతాది మాత్రం వ్యతిరేకించారు అని అన్నాడు. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అర్హత లేకపోయినా ఫలాన పథకం రాలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అని.. అలా ప్రశ్నించిన కూడా అది వ్యతిరేకత కాదని అన్నాడు.