Kranthi Balivaada: అలాంటి వీడియోలు చేసే వాళ్లు కూడా సినిమాల్లోకి వచ్చేస్తున్నారు: క్రాంతి బలివాడ

తనకు హీరోయిన్ రమ్యకృష్ణ చేసేది డైనమిక్ నటన అంటే చాలా ఇష్టమని ఆర్టిస్ట్ క్రాంతి బలివాడ తెలిపారు. తనతో శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో కలిసి పని చేశానని ఆమె చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే తనకు రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం అని అని ఆమె చెప్పారు తనతో కలిసి పని చేయడానికి ముందే బాహుబలి సినిమా చూశానని అందులో ఆమె క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుందని తెలిపారు. అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుందని ఆమె చెప్పారు.

ఇకపోతే ప్రముఖ నటి నదియా చేసే క్యారెక్టర్స్ అన్నా కూడా తనకు చాలా ఇష్టమని క్రాంతి బలివాడ తెలిపారు. ఎప్పటికైనా తనకు అలాంటి అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నట్టు ఆమె తెలిపారు.

సినీ ఇండస్ట్రీలో తనకు నచ్చని విషయాలపై క్రాంతి బలివాడ పెదవి విప్పారు. హాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఉన్నట్టు మనకు నటనకు సంబంధించి ప్రత్యేకమైన కోర్సులు ఇక్కడ లేవు అని ఆమె చెప్పారు. ఉదాహరణకు ఒక మోడల్ అవ్వాలంటే దానికి సంబంధించిన కోర్సు మాత్రమే చేసి ఉండాలని, ఒక యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ కోర్సు చేసి ఉండాలని, అవన్నీ చేస్తేనే వాళ్లకు సినిమాల్లో లేదా దానికి సంబంధించిన రంగాల్లో చేసే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. ఒక యాక్టర్ ఒక డైరెక్టర్ అవ్వలేడు. అది అవ్వాలంటే ఆ కోర్సు చేసి ఉండాలని ఆమె తెలిపారు. మన ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏమీ తెలియక పోయినా వచ్చేయొచ్చు అని ఆమె అన్నారు. కొంతమంది టిక్ టాక్ వీడియోలు చేసి సినిమాల్లోకి వస్తున్నారని, అసలు ఆ వీడియోలు చేయడం వల్ల ఆర్టిస్ట్ ఎలా అవుతారని ఆమె ప్రశ్నించారు. ఎవరో చెప్పిన వాయిస్ కి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఏంటి అని ఆమె అన్నారు. ఇమిటేషన్ ఎవరైనా చేయగలరు కానీ ఎలా నటిస్తావు అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి చేయడానికి, తెలుసుకోవడానికి చాలా కోర్సులు కూడా ఉన్నాయని ఆమె అన్నారు.