ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 19 నెలల సమయం మాత్రమే ఉంది. 2024 ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని కోరుకునే వాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో ఆయన సీఎం కాకూడదని కోరుకునే వాళ్లు సైతం దాదాపుగా అదే స్థాయిలో ఉన్నారు. టీడీపీ నేతలు 2024లో చంద్రబాబు సీఎం కాకపోతే టీడీపీకి భవిష్యత్తు ఉండదని భావిస్తుండటం గమనార్హం. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు పార్టీ అధికారంలో లేకపోతే ఎదురయ్యే కష్టాలు తెలియనివి కావు.
అయితే గత మూడేళ్లలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల జగన్ కు ప్రజాదరణ పెరిగిందా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. అయితే జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకత జగన్ మళ్లీ అధికారంలోకి రాని స్థాయి వ్యతిరేకత అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సర్వేలలో జగన్ పై వ్యతిరేకత మరింత పెరిగిందని తేలినా ఒక సర్వేలో మాత్రం జగన్ కు 57 శాతం మంది ప్రజల మద్దతు ఉందని తేలింది.
జాతీయ మీడియా సర్వేలలో జగన్ కు అనుకూల ఫలితాలు వస్తుండటంతో వైసీపీ నేతలు సైతం సంతోషిస్తున్నారు. అయితే ప్రజాదరణ పెరిగినా జగన్ పాలన విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 18 లేదా 19 ఎంపీ స్థానాలలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే వైసీపీకి 130కు అటూఇటుగా అసెంబ్లీ స్థానాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి.
అయితే జగన్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త వహించాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జగన్ టికెట్లు ఇవ్వకూడదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. జగన్ ఇతర రాష్ట్రాలలోని చాలామంది సీఎంలతో పోలిస్తే మెరుగైన పాలన అందిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.