మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురించి వైసీపీ లో హాట్ టాపిక్ !  

 

గుంటూరు మిర్చి ఘాటు గురించి అందరికి తెలిసిందే.. కానీ రాజకీయాల్లో ఘాటుగా సాగే చోటు ఏదంటే ఆంధ్ర పాల్‌టిక్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడు వేడి వేడి ఇరానీ చాయ్‌ని తలపించేలా ఉంటాయి.. బహుశా తెలంగాణ రాజకీయాల్లో ఏ పోరు లేకుండా కాలం సాగుతుంది.. ఇకపోతే ఏపీ రాజకీయాల్లో నూనెలో మరుగుతున్న మిరపకాయ్ బజ్జీలా ఉన్న మ్యాటర్ ఏంటంటే లోక్ సభ నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా చేయాలనే నిర్ణయం.. ఈ విషయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట నెగ్గుతుందా.. లేదా.. అన్నది వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది..

కాగా వైఎస్ జగన్ ఈ జిల్లా కేంద్రాల కొరకు చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీని కూడా నియమించారు. అయితే రాజంపేట విష‍యంలోనే తర్జభర్జనలు జరుగుతున్నాయట.. ఇక రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాలున్నాయి. కడప జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. కాగా జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తీసుకురావాలని పెద్దిరెడ్డిపై వత్తిడి పెరుగుతుందట.. అయితే చిత్తూరు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండటంతో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే తన ఆధిపత్యం తగ్గిపోతుందని భావిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. దీనిపై కడప జిల్లా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి రాయచోటి ప్రాంత వాసులు కూడా నో చెబుతున్నారు..

ఇకపోతే వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవడానికే ఎక్కువగా ప్రయత్నిస్తుంటాడట.. ఈ క్రమంలో తన జిల్లాలో ఆధిపత్యం కోసం ఈయన నిత్యం ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న జిల్లా కేంద్రాల విషయంలో వైఎస్ జగన్ ను ఎలా ఒప్పించగలుగుతారో చూడాలని అంటున్నారు వైసీపీ నేతలు.. ఒకవేళ రామచంద్రారెడ్డి మాట నెగ్గించుకుంటే మిగతా నేతలతో తలనొప్పులు రావడం ఖాయం, అలాగని ఈయన మాట కాదంటే మరే ఇబ్బంది వస్తుందో.. అందుకని వైఎస్ జగన్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలనే ఆసక్తి అందరిలో కలుగుతుందట..