జేసీ బ్రదర్స్ కు బలం పెంచిన పెద్దారెడ్డి.. హద్దులు దాటటం మంచిది కాదయ్యా

peddareddy jc prabhakar reddy

 జనతా గ్యారేజ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంటుందని, సరిగ్గా రాజకీయాల్లో కూడా బలహీనుడి పక్కనే జనాలు ఉంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాజకీయాలు చేయాలనీ కానీ, ప్ర‌త్య‌ర్థుల‌ను లొంగదీసుకోవాలని, మరేదో చేయాలనీ చూస్తే మొదటికే మోసం వస్తుంది. 2019 లో జగన్ భారీ మెజారిటీతో గెలవటానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టి ప్రతి రాజకీయ నేత ఈ విషయాన్నీ గమనం చేసుకుంటూ ఉండాలి.

peddareddy jc prabhakar reddy

 తాజాగా తాడిపత్రిలో జరిగిన సంఘటన చూస్తే ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన బలం ఏంటో చూపించాలనే ఆత్రంతో జేసీ ఇంటికి రాద్ధాంతం చేశాడు కానీ, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏమిటో గ్రహించలేకపోయాడు. అధికారంలో ఉన్న‌ప్పుడు పులుల్లా గాండ్రించిన జేసే బ్ర‌ద‌ర్స్‌…. అధికారం పోగానే పిల్లుల్లా “మ్యావ్ మ్యావ్” మంటున్నారు. దీన్ని బ‌ట్టి బ‌లం అధికారానిదే త‌ప్ప వ్య‌క్తుల‌గా త‌మ‌ది కాద‌ని జేసీ బ్ర‌ద‌ర్స్‌కు జ్ఞానోద‌యం అయింది.జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత జేసీ బ్ర‌ద‌ర్స్ కోర‌లు తీసింది. నెల‌ల త‌ర‌బ‌డి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడిని జైల్లో పెట్టించి గ‌తంలో చేసిన త‌ప్పు ప‌నుల‌ను త‌గిన శిక్ష వేయించిన‌ట్టైంది. అలాగే ఆర్థికంగా కూడా జేసీ బ్ర‌ద‌ర్స్‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం చావు దెబ్బ‌తీసింది, ఇంకా తీస్తోంది. ఇప్పుడు జేసీ బ్ర‌ద‌ర్స్ చాలా బ‌ల‌హీన‌ప‌డ్డారు. జేసీ బ్ర‌ద‌ర్స్‌పై ఇంత వ‌ర‌కూ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి కూడా ఆమోదం ఉంది.

 కానీ పెద్దారెడ్డి చేసిన పనిని యావత్తు ప్రజానీకం తప్పు పడుతుంది. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇంటిపైకి గురువారం దాడికి వెళ్ల‌డ‌మే కాకుండా, తాజాగా వారిపైన్నే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడాన్ని పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌గా జ‌నం అభిప్రాయ‌ప‌డుతున్నారు. దానికి కారణం పెద్దారెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇసుక అక్ర‌మ ర‌వాణా విష‌య‌మై త‌న భార్య‌పై సోష‌ల్ మీడియాలో జేసీ బ్ర‌ద‌ర్స్ అబద్ధ‌పు ప్ర‌చారాన్ని చేస్తున్నార‌ని పెద్దారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగా కుటుంబ స‌భ్యుల‌పై అస‌త్య ప్ర‌చారం ఎవ‌రికైనా బాధ క‌లిగిస్తుంది. అయితే పెద్దారెడ్డి ఇక్క‌డ ఓ లాజిక్ మిస్ అయ్యారు. అధికారంలో తామున్నామ‌నే విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోయారు.

 తన భార్యపై జరుగుతున్నా ప్రచారం కేవలం అబ్ధ‌మ‌ని భావిస్తున్నాడు కాబట్టి, దానిపై పోలీసుల‌తో విచార‌ణ చేయించి, త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగిస్తున్న వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే అధికారం చేతిలో పెట్టుకుని, అన‌వ‌స‌ర వివాదానికి తెర‌లేపార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంటికి వెళ్లిమరీ దాడి చేయటంతో చేజేతులా ప్ర‌త్య‌ర్థులైన జేసీ బ్ర‌ద‌ర్స్‌పై ప్రజల్లో సానుభూతి తెప్పిస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గతంలో జేసీ చేసిన దానికి ఇప్పుడు పెద్దారెడ్డి చేసిన పెద్దగా తేడా ఏమి లేదని అక్కడి జనాలు మాట్లాడుకుంటున్నారు.