విజయశాంతి ఎంట్రీ తో పవన్ విలువ తెలిసింది.. ఎందుకయ్యా ఆరాటం

vijayashanti pawan kalyan

 తెలంగాణ కాంగ్రెస్ లేడి ఫైర్ బ్రాండ్ అని అందరు పిలుచుకునే విజయశాంతి తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయింది. ఆమె చేరిక బీజేపీ లో ఒక పండగలాగే చేశారని చెప్పాలి. ఆమె రాకకు ఢిల్లీ స్థాయి నేతలు సాక్షిగా నిలబడ్డారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, అమిత్ షా లాంటి అగ్రనేతల సమక్షంలో విజయశాంతి ఎంట్రీ జరిగింది.

Vijayashanti bjp

 ప్రస్తుతం తెలంగాణలో విజయశాంతికి రాజకీయంగా పెద్దగా క్రేజ్ తక్కువనే చెప్పాలి. టీఆర్ఎస్ ఊపు మీద ఉన్న‌ప్పుడు విజ‌యం సాధించారు కానీ, అప్పుడెప్పుడో బీజేపీలో ప‌ని చేసిన‌ప్పుడు కానీ, సొంత పార్టీ పెట్టిన‌ప్పుడు కానీ.. కాంగ్రెస్ లో ప‌ని చేసిన‌ప్పుడు కానీ.. గెలిచిన దాఖాలు లేవు! అదీ విజ‌య‌శాంతి పొలిటిక‌ల్ స్టామినా. సినిమాల్లో ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా చ‌లామ‌ణి కావ‌డ‌మే విజ‌య‌శాంతి రాజ‌కీయాల్లో ఉనికిని క‌లిగి ఉండ‌టానికి కార‌ణం. ఈ జ‌న‌రేష‌న్ సినిమా ప్రియులు కూడా ఆమె స్టార్ హీరోయిన్ అనే విష‌యం మ‌రిచిపోయారు!

 అప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి పార్టీలోకి వస్తే న‌డ్డా ఆధ్వ‌ర్యంలో కాషాయ కండువా, ఆ వెంట‌నే అమిత్ షా తో మీటింగ్! ఇదీ విజ‌య‌శాంతి కి క‌మ‌లం పార్టీలో ద‌క్కుతున్న ట్రీట్ మెంట్. కానీ ఇప్పుడు స్టార్ హీరోగా వెలుగుతున్న పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరితే నడ్డా దర్శనం కావటానికి రెండు మూడు రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. అది పవన్ కళ్యాణ్ కు విజయశాంతికి బీజేపీ ఇస్తున్న విలువ.

 విజయశాంతి ని పార్టీలోకి రావాలని బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి నేతలు అనేక సార్లు ఆమె ఇంటికి వెళ్లిమరీ కోరారు. కానీ పవన్ కళ్యాణ్ తనకు తానే ఎదురెళ్లి కమలం పల్లకి మోస్తున్న కానీ జనసేనాని తగిన గుర్తింపు ఇవ్వటం లేదు బీజేపీ పార్టీ. ఎదో మీడియా ముందు అధికారికంగా పొత్తు అనుకోవటం తప్పితే, రెండు రాష్ట్రాల్లో ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకు నడవటం లేదు, కనీసం ఉమ్మడి నిర్ణయం కూడా ప్రకటించటం లేదు. మొదటి నుండి పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ చిన్న చూపు చూస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి, తాజాగా విజయశాంతి రాకతో ఆ మాటలు మరోసారి తెర మీదకు వచ్చాయి.