ఎన్నో అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం ‘వకీల్ సాబ్’ మొదటిరోజును పూర్తి చేసుకుంది. ప్రభుత్వం ఆంక్షలు, కోవిడ్ భయాందోళనల నడుమ థియేటర్లలోకి అడుగుపెట్టిన ‘వకీల్ సాబ్’ దాదాపు నార్మల్ రోజుల్లో చూపించగలిగిన భీభత్సాన్ని చూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే సినిమా కలెక్షన్లు చూస్తే 36.4 కోట్ల షేర్ మార్క్ తాకింది. తెలుగు రాష్ట్రాల్లో 32.2 కోట్ల షేర్ వసూలు చేసింది. కరోనా సమయంలో ఈ స్థాయి వసూళ్లు అంటే మామూలు విషయం కాదు. అందునా సాధారణ టికెట్ ధరలతోనే ఇంత పెద్ద మొత్తం వసూలైంది.
నైజాంలో 8.7 కోట్లు, సీడెడ్లో 4.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.8 కోట్లు, ఈస్ట్, వెస్ట్ కలిపి 7.6 కోట్లు, కృష్ణాలో 1.9 కోట్లు, గుంటూరులో 3.94 కోట్లు, నెల్లూరులో 1.7 కోట్లు కలిపి మొత్తంగా 32.2 కోట్ల షేర్ నమోదైంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.8 కోట్లు, ఓవర్సీస్లో 2.4 కోట్లు కలిపితే టోటల్ 36.4 కోట్లుగా ఉంది. ఫస్ట్ డే టికెట్ టికెట్ హైక్స్ గనుక ఉండి ఉంటే ఈ మొత్తం 40 కోట్లకు చేరువలో ఉండేది. సినిమా మొత్తంగా 90 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ మీద బరిలోకి దిగగా హిట్ గా నిలవాలంటే ఇంకో 53.5 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. శని, ఆదివారాలు సెలవులు కావడం, వచ్చే వారంలో రెండు పబ్లిక్ హాలిడేస్ ఉండటం సినిమాకు కలిసొచ్చే విషయం.