Pawankalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాలు మరియు పాలిటిక్స్ లో బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా తన మాస్ సినిమా “భీమ్లా నాయక్” సినిమా షూటింగ్ ముగించి జనసేన తరపున నిన్న స్టీల్ ప్లాంట్ బాధితులు కోసం వచ్చాడు. అయితే ఇదే సమయంలో సినిమాలు తనని ఆర్ధికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ఏపీ ప్రభుత్వం కి మళ్లీ మాస్ వార్నింగ్ ఇవ్వడం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.
పవన్ కి ఆర్ధిక మూలం అయ్యినటువంటి సినిమాలకు సంబంధించి ఎప్పుడు నుంచో ఏపీ గవర్నమెంట్ కొత్త కొత్త చట్టాలు తేవడం ఒక్క పవన్ సినిమాలకే కాకుండా టోటల్ టాలీవుడ్ సినిమాలకు దెబ్బ పడేలా చేసింది. మరి దీనిపై మాట్లాడుతూ నిన్న పవన్ కళ్యాణ్ నా ఆర్ధిక మూలాల మీద దెబ్బ కొడితే భయపడతా అనుకున్నారా తనతో కనుక పంథానికి పోతే ఏపీలో ఫ్రీ గా సినిమా నేను చూపిస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో వాళ్ళు తగ్గకపోతేన్ నేను కూడా తగ్గను అని మరోసారి క్లియర్ కట్ గా చెప్పేసాడు. మరి ఈ కీలక సమస్య ఎక్కడ ఆగుతుందో చూడాలి.