“NTR30” కి పవన్ పవర్ఫుల్ టైటిల్? కానీ అసలు ట్విస్ట్ ఇదే.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన అవైటెడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా ప్లాన్ చెయ్యగా ఆల్ మోస్ట్ ఆగిపోయింది అనుకున్న ఈ సినిమా లైవ్ లోనే ఉందని మేకర్స్ గత వారమే అనౌన్స్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇప్పుడు ఈరోజు ఓ ఊహించని రూమర్ అయితే బయటకి వచ్చి సెన్సేషన్ గా మారింది. మరి ఈ అప్డేట్ అయితే చిత్ర బృందం ఈ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ “దేవర” ని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి ఈ టైటిల్ ని అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తన వీరాభిమాని నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ ఎప్పుడో ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించగా దానిని రెన్యూవల్ చేసుకోకపోయేసరికి అయితే కొరటాల ఈ టైటిల్ ని ఎన్టీఆర్ కోసం తీసుకున్నాడని ఇప్పుడు సినీ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్రం టైటిల్ పై లేటెస్ట్ గా అసలైన ట్విస్ట్ తెలుస్తుంది..

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. ఇంకా చిత్ర యూనిట్ అయితే ఎలాంటి టైటిల్ ని రిజిస్టర్ చేయలేదని ఇప్పటివరకు ఎలాంటి టైటిల్ కూడా నమోదు చెయ్యలేదని టాలీవుడ్ ఫిల్మ్ ట్రాకర్స్ ద్వారా అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. దీనితో ఇపుడు వైరల్ అవుతున్న టైటిల్ నిజం కాదనే చెప్పాలి.