అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకున్న పవన్..షాక్ లో తెరాస

pawan kalyan telugu rajyam

 పార్ట్ టైం పొలిటీషియన్ అనే పేరు ముట్టకట్టుకొని రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను కొన్ని పార్టీల వాళ్ళు తేలిగ్గా తీసుకుంటూ ముందుకి వెళ్తుంటారు, అయితే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయాలు అలాంటి పార్టీలకు ఊహించని షాక్ తగిలేలా చేస్తాయి. ప్రస్తుతం తెలంగాణలో తెరాసకు అలాంటి షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు మావే అంటూ ప్రచారం చేసుకుంటున్న తెరాసకు గట్టి షాక్ ఇస్తూ బుధవారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని 50 డివిజన్లలో పార్టీ కమిటీలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

pawan kalyan telugu rajyam

  తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉండే పవన్ కళ్యాణ్, ఉన్నట్లుండి ఈ ప్రకటన చేయటం రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించాయి. పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బీజేపీ పార్టీ హస్తముందని అంటున్నారు. ఆంధ్రాలో బీజేపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి నడిస్తే మంచిది అనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ కి కలిగేలా చేయటంలో బీజేపీ పెద్దలు సఫలం అయ్యినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి నేత బీజేపీ తరుపున ఎన్నికల్లో ప్రచారం చేస్తే అది బాగా కలిసివచ్చే అవకాశం వుంది. అధికార తెరాస కు గట్టిపోటీ ఇవ్వచ్చు .. అందుకే పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో కూడా రంగంలోకి దించారు.

  కేవలం ప్రచారానికే జనసేన అధినేతను ను పరిమితం చేయకుండా, పొత్తు ధర్మం ప్రకారం ఆ పార్టీకి కొన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ 50 డివిజన్ ల్లో పార్టీ కమిటీలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. జనసేనాని గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేసి, పోటీ చేయటం వలన తెరాస కు కొంచం నష్టం కలిగే అవకాశాలు లేకపోలేదు. పవన్ రాకతో గ్రేటర్ ఎన్నికల్లో తెరాస కు పరాజయం తప్పదు అనే స్థాయి లేకపోయినా కొన్ని కొన్ని డివిజన్స్ లో తెరాస కు పవన్ ప్రచారం నష్టం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ పార్టీకి కూడా కావాల్సింది ఇదే, అందుకే పవన్ కళ్యాణ్ ను ఏరికోరి తెలంగాణలో బరిలోకి దించబోతున్నారు.. దీనితో గ్రేటర్ ఎన్నికలు తెరాస -కాంగ్రెస్ అన్నట్లు కాకుండా తెరాస – బీజేపీ అన్నట్లు టర్న్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం గ్రేటర్ పరిధిలో ఎంత వరకు ఉంటుందో చూడాలి..