Renu Desai షాక్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఆస్తులు.. ఎంత విలువ చేస్తాయంటే?

Renu Desai: స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బద్రి సినిమా సమయంలో ఒకరినొకరు ప్రేమించుకున్న అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా గడిపిన ఆ తర్వాత పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రేణుదేశాయ్ తన పిల్లలతో కలిసి పూణేలో నివసిస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న ఈమె ఆ తర్వాత దర్శకురాలిగా, నిర్మాతగా పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రేణుదేశాయ్ భారీ మొత్తంలో భరణం కింద తీసుకుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణుదేశాయ్ తన గురించి వస్తున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాను పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అసలు విషయం బయట పెట్టారు. కాకపోతే ఒక తండ్రిగా పిల్లలకు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలో ఆ బాధ్యతలను పవన్ కళ్యాణ్ చేస్తున్నారని రేణుదేశాయ్ తెలిపారు.

ఇక రేణుదేశాయ్ ఆస్తుల విషయానికి వస్తే ఈమెకు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఒక ఖరీదైన ఇల్లు మూడు కార్లు ఉన్నాయని సమాచారం.అలాగే పూణే లో కూడా కొన్ని స్థిరచరాస్తులు ఉన్నాయని సోషల్ మీడియాలో వినిపిస్తున్నప్పటికీ వీటి గురించి అధికారిక ప్రకటన లేదు. అయితే మొత్తానికి రేణుదేశాయ్ సుమారు 40 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించిందనీ వార్తలు వస్తున్నాయి.