మిత్రుడికి ఆపద సమయంలో హ్యాండ్ ఇచ్చిన పవన్

 ఆంధ్రప్రదేశ్ లో 2024 లో జరగబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ మరియు జనసేన కలిసి పొత్తు ఏర్పాటు చేసుకొని కలిసి ప్రయాణం సాగిస్తున్నాయి. అయితే ఈ ప్రయాణంలో ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నిన్న మొన్నటి దాక ఏమైనా మైలేజ్ వచ్చే కార్యక్రమాలు ఉంటే కేవలం బీజేపీ నేతలే వాటిని సొంతగా చేసేవాళ్ళు, కనీసం జనసేన జెండా కూడా అక్కడ కనిపించేది కాదు.

Pk And Somu

 ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి అదే రీతిలో సమాధానం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఆంధ్రాలో విశాఖ ఉక్కును ప్రవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో అది రాష్ట్ర బీజేపీ నేతలను ఇరకాటంలో నెట్టింది. ఆంధ్రాలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్న కానీ బీజేపీ కనీసం నోరెత్తలేని పరిస్థితి.

 ఇలాంటి స్థితిలో జనసేన కనీసం బీజేపీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. బీజేపీపై వ్య‌తిరేక‌త‌, మిత్ర‌ప‌క్ష‌మైన త‌మ‌పై కూడా ప‌డుతోంద‌ని జ‌న‌సేన ఆందోళ‌న చెందుతోంది. ఈ నేప‌థ్యంలో విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ విష‌య‌మై పున‌రాలోచించాల‌ని, కార్మికుల ప్ర‌యోజ‌నాల విష‌య‌మై ఆలోచించాల‌ని ఇటీవ‌ల కేంద్రం పెద్ద‌ల‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్ విన్నవించి వచ్చాడు. అంతకు మించి ఒక్క మాట కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు జనసేనాని. 

 ఈ నేప‌థ్యంలో ఏపీలో బీజేపీ ఒంట‌రి అయ్యింది. త‌మ‌పై వ్య‌తిరేక‌త ప్ర‌భావం ఎక్క‌డ చూపుతుందోన‌నే భ‌యంతో బీజేపీకి జ‌న‌సేన దూరం దూరంగా ఉంటోంది.ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ మాట‌లు వింటే… ఆ పార్టీ దీన‌స్థితిని తెలుసుకోవ‌చ్చు.

 రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రధాన పోటీదారు అవుతుందన్న భయంతో వైసీపీ, టీడీపీ విశాఖలో డ్రామాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత మార్పిళ్లు, ఆలయాలపై దాడుల గురించి ప్రశ్నించకూడదనే వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు తమను ఏకాకిని చేసేందుకు కుట్రపన్నాయని వారు మండిపడ్డారు. పాపం మిత్రుడు ఇంత కష్టకాలంలో ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం తాపీగా సినిమాలు చేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles