పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయాలు జనాలకు అర్ధం కాకపోయినా, కనీసం ఆయనకైనా అర్ధం అవుతాయో లేదో తెలియని పరిస్థితి. అగ్ర హీరోగా చలామణి అవుతున్న సమయంలో రాజకీయాలు అంటూ జనసేన పెట్టి, హడావిడి చేసి, మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నాడు. గుర్తొచ్చిన ప్రతిసారి ఒక ట్విట్, ఒక ప్రెస్ నోట్ విడుదల చేయటం తప్ప పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయమేమి లేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పవన్ యొక్క రాజకీయ యాక్టివిటీస్ చాలా తగ్గిపోయాయి. బీజేపీతో దోస్తీ కట్టిన నాటి నుండి ఆంధ్ర రాజకీయాలకు దూరమయ్యాడు.
గతంలో ప్రెస్ మీట్ పెడితే పవన్ కు మీడియా కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, ఎప్పుడైతే సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాడో, అప్పటినుండి పవన్ కళ్యాణ్ ని ఎవరు పట్టించుకోవటం లేదు. సోము వీర్రాజు చంద్రబాబును టార్గెట్ చేస్తూ, తన మాటలతో అందరిని తనవైపు తిప్పుకున్నాడు. అదే పని పవన్ కళ్యాణ్ చేయలేడు. బాబును పల్లెత్తి ఒకమాట కూడా అనటానికి పవన్ మనస్సు ఒప్పుకోదు. అలాగని జగన్ మీద విమర్శలు చేయాలంటే బీజేపీ పార్టీ ఒప్పుకోదు. దీనితో పవన్ మాట్లాడటానికి సబ్జెట్ లేకుండా పోయింది. మోడీ ఏమైనా కార్యక్రమం చేస్తే, దాని గురించి పొగుడుతూ ఒక ట్విట్ వేసుకోవటం తప్ప జనసేనాని చేసేది ఏమి లేదు. మొన్నటి వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో భారీ నష్టమే జరిగింది. దానిని క్యాష్ చేసుకోవటం కోసం నారా లోకేష్ లాంటి నేతకూడా బురదలో దిగి హౌరా అనిపించాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన తర్వాతి సినిమాల స్టోరీలో బిజీ గా గడుపుతున్నాడు. ఇలాంటి మనిషి ఇక రాజకీయాలు ఏమి చేస్తాడు, రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తాడో చూడాలి.
కనీసం ఆయన ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకోనైనా సరే వచ్చేసి, నాలుగైదు స్టిల్స్ ఇచ్చి వెళ్ళిపోతే వాళ్లే ఎదో ఒక బాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టుకొని, ఫోటోషాప్ చేసుకొని ఐదారు నెలలు గడిపేసేవాళ్ళు కనీసం వాళ్ళని కూడా జనసేనాని పట్టించుకోకపోవటం దారుణం. పవన్ కళ్యాణ్ కేవలం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు తప్పితే, అందులో విలీనం చేయలేదు. కానీ ఆయన వాలకం చూస్తుంటే తాను, తన పార్టీని బీజేపీలో కలిపేసినట్లు అనిపిస్తుందని, అందుకే ఈ మధ్య కాలంలో ఆంధ్ర వైపు “పవనా”లు వీయటం తగ్గిపోయాయంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఎవరెన్ని అనుకున్న కానీ, తాను తీయబోయే సినిమాల్లో ఇలాంటి మార్పు లేదని, అవసరమైతే ఇంకో రెండు ముందు సినిమాలకు అడ్వాన్స్ కూడా తీసుకోవటానికి తాను సిద్దమే అంటూ నిర్మాతలకు హింట్ లు ఇస్తున్నాడు. మరి రాజకీయాలు మర్చిపోయాడేమో…