Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు జీరో నుంచి ఈయన 100% స్ట్రైక్ రైట్ వరకు తన పార్టీని తీసుకువెళ్లారు గత ఎన్నికలలో 21 స్థానాలలో విజయ దుదుంబి మోగించారు. ఇలా 100% స్ట్రైక్ రైట్ సంపాదించి పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలలో కూడా సంచలనగా మారారు. ఇప్పటికి పోటీ చేసిన 21 సీట్లలో విజయ దుందుభి జనసేనను మరింత విస్తరించే పనిలో పవన్ ఉన్నారు. దానికి మార్చి 14న జరిగే పిఠాపురం ప్లీనరీతో కేడర్ కు దిశా నిర్దేశాలు చేయనున్నారు.
ఇలా ప్లీనరీ ముందు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతున్నాయి. 2024 ఎన్నికలలో భాగంగా జనసేన తెలుగుదేశం బిజెపి ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగి విజయం సాధించాయి అయితే ఈ ఎనిమిది నెలల కాలంలోనే కూటమి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని కూటమి చీలిపోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
ఇలా కూటమి చీలిక గురించి ఇటీవల పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో స్పందించారు మా మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చిన మమ్మల్ని ఎంతమంది తిట్టుకున్న మేము మాత్రం మరో 15 సంవత్సరాలు కలిసే పోరాటం చేస్తామని విడిపోయే అవకాశం లేదని తెలియజేశారు. ఇలా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీకి షాకింగ్ అనే చెప్పాలి. ఇలా వైసిపికి పవన్ వ్యాఖ్యలు కాస్త షాక్ కి గురి చేసినప్పటికీ జనసైనికులలో కూడా కొంతమేర పవన్ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేసాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయసు 53 మరో 15 సంవత్సరాలు అంటే సుమారు 68 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఇలాగే కూటమి కొనసాగుతుందని ఈయన మాట్లాడారంటే అప్పటివరకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కారా అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు తమ అధినేతను ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తున్న జనసైనికులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు. 15 సంవత్సరాల వరకు కూటమి కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ 15 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటారని ఎక్కడ చెప్పలేదు కదా అంటూ మరికొందరు పవన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.
