ఇంత బిజీలో అక్కడ షూటింగ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్.!

harihara veeramallu

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు టాలీవుడ్ లో సహా రాజకీయాల్లో కూడా మంచి బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఏంటంటే రాజకీయాలతో పాటుగా సినిమా పనులు కూడా గ్యాప్ లేకుండా చేస్తూ ఉండడం విశేషంగా మారింది.

ఇక ఇప్పుడు అయ్యితే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం “హరిహర వీరమల్లు” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ ని పవన్ శరవేగంగా చేస్తున్నాడు. లేటెస్ట్ గా అయితే చిత్రం షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్టింగ్స్ లో జరుగుతుండగా..

ఈరోజు ఈ షూటింగ్ లో పవన్ ప్లాగొన్నాడట. మరి మొత్తం ఈ షెడ్యూల్ రెండు వారాల పాటు జరగనుండగా పవన్ ఈ షెడ్యూల్ లో చురుగ్గా పాల్గొననున్నాడట. ప్రస్తుతం అయితే ఇంత బిజీలో కూడా పవన్ సినిమాల్లో నటిస్తుండడం మంచి హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ చిత్రంలో అయితే హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. అలాగే మెగా సూర్య బ్యానర్ పై ఏ ఎం రత్నం భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.