వకీల్ సాబ్’ సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నడిచిన వివాదం ముగిసింది. ప్రభుత్వ వాదనను ఏకీభవిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరించింది. పెంచిన టికెట్ ధరలను శనివారం వరకే అమలుచేయాలని ఆదివారం నుండి ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ ధరలకే టికెట్లను విక్రయించాలని తీర్పునిచ్చింది. దీంతో నిన్న శనివారం ఒక్కరోజే టికెట్ రేట్లను పెంచుకోగలిగారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ ఉత్తర్వులతో సినిమా కలెక్షన్ల మీద పెను ప్రభావం పడనుంది. సాధారణంగా ప్రతి పెద్ద సినిమాకు మొదటి వారం టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు, బెనిఫిట్ షోలు, ఎక్స్ట్రా షోలు వేసుకునే అవకాశం ఉండేది గతంలో.
కానీ ‘వకీల్ సాబ్’ విడుదల ముందురోజు సర్కార్ కొత్త జీవో జారీ చేసింది. టికెట్ ధరలు పెంచరాదని, అదనపు షోలు ఉండవని తేల్చింది. దీంతో అధిక ధరలకు సినిమా హక్కుల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనలో పడిపోయారు. ఫర్ట్ డే నార్మల్ ధరలతోనే మంచి వసూళ్లు వచ్చాయి. అదే హైక్ ఉండి ఉంటే ఇంకాస్త మెరుగ్గా అనేది పరిస్థితి. రెండవ రోజు కూడ సినిమా మంచి రన్ కనబర్చింది. ఇక మూడవ రోజు నుండి నార్మల్ ధరలే. ఈ ధరలతో పెట్టుబడి రావాలంటే లాంగ్ రన్ తప్పనిసరి. అధిక పవన్ క్రేజ్ మీద ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ టాక్ కు తోడు పవన్ ఛరీష్మా గట్టిగా పనిచేస్తేనే 90 కోట్ల షేర్ మార్క్ అందుకోగలుగుతుంది సినిమా.