పెద్ద హీరోలకు ‘వకీల్ సాబ్’ ధైర్యం ఇచ్చాడు

Pawan Kalyan Gives Big Boost Up Stars

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ భారీ అంచనాల నడుమ ఈరోజే విడుదలైంది. రికార్డ్ స్థాయి థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. మూడేళ్ళ తరవాత పవన్ నుండి వస్తున్న సినిమా కావడంతో తప్పకుండా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు. పెద్ద సినిమాలకు ప్రేక్షకులు ధైర్యం చేసి వస్తారా రారా అనేది కూడ ఈ సినిమాతోనే తేలనుంది. రానున్న రోజుల్లో చాలా పెద్ద సినిమాలు విడుదలకావాల్సి ఉంది. ఆ సినిమాలన్నింటికీ ‘వకీల్ సాబ్’ ఒక ప్రయోగం అనుకోవచ్చు . ఈ సినిమా పట్ల జనం చూపించే ఆసక్తి మీదే స్టార్ హీరోల సినిమాల రిలీజ్ మీద ఒక అంచనా వస్తుంది.

అందుకే స్టార్ హీరోలంతా ఆసక్తిగా ‘వకీల్ సాబ్’ పెర్ఫార్మెన్స్ మీద దృష్టి పెట్టారు. అయితే పవన్ మేనియా ముందు కరోనా భయం కూడ నిలబడలేదు. అభిమానులు, ప్రేక్షకులు తెల్లవారుఘాము నుండే థియేటర్ల వద్ద బారులు తీరారు. ఎర్లీ మార్నింగ్ షోలకు అన్ని సినిమా హాళ్లు కిక్కిరిసిపోయాయి. ప్రతి థియేటర్ వద్దా పండుగ వాతావరణం కనబడుతోంది. ఎక్కడ చూసినా హౌజ్ ఫుల్ బోర్డులే. అడ్వాన్స్ బుకింగ్స్ సంగతి చెప్పాల్సిన పనే లేదు. వీకెండ్ మొత్తం ఫుల్ అయ్యాయి. పూర్వం పెద్ద సినిమాల పండుగ ఎలా ఉండేదో ఇప్పుడూ అలానే ఉంది. అమెరికాలో సైతం తెలుగు ఆడియన్స్ సినిమా హాళ్లకు వస్తున్నారు. మొత్తంగా కరోనా ఫీవర్ ‘వకీల్ సాబ్’ ముందు పనిచేయలేదనే అనాలి. ఈ ఓపెనింగ్స్ చూశాక మిగతా పెద్ద హీరోలకు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చనే ధైర్యం వస్తుందనడంలో సందేహమే లేదు.

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles