ఎగ్జైటింగ్ న్యూస్..చాలా ఏళ్ళకి పవన్ ఫ్యాన్స్ కోరుకునే కాంబో రాబోతోందా?

Bhavadeeyudu Bhagat Singh

టాలీవుడ్ అగ్ర హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల కన్నా పాలిటిక్స్ లోనే ఎక్కువ బిజీగా ఉంటున్నాడు. అయితే మరోపక్క పవన్ సినిమాలు అయితే ఆగకుండా ఎప్పటికప్పుడు కొత్త వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

మరి వీటిలో అయితే లేటెస్ట్ గా పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్డేట్ లాంటిది ఒకటి కన్ఫర్మ్ అయ్యేలా ఉందని చెప్పాలి. ఇక ఈ డీటెయిల్స్ లోకి వెళితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో చూసినట్టు అయితే చాలా వరకు తన సినిమాలు అన్నీ మ్యూజికల్ గా పెద్ద హిట్స్ ఉన్నాయి.

కొన్ని ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ కూడా వాటిలో ఉండగా ఈ ఆల్బమ్స్ లో మాత్రం సంగీత దర్శకుడు రమణ గోగుల ఆల్బమ్స్ కి అయితే పవన్ ఫ్యాన్స్ లో స్పెషల్ ప్లేస్ ఉంది. కరెక్ట్ గా పవన్ కి సెట్టయ్యే వాయిస్ గోగుల సొంతం కావడంతో  పాటలు అంటే ఇక పాత రోజుల మ్యాజిక్ లోకి వెళ్లిపోవాల్సిందే.

ఇక ఇప్పుడు మళ్ళీ ఈ కాంబోలో పాట వస్తుంది అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదే సాధ్యం అయ్యేలా అనిపిస్తుంది. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ రమణ గోగులని అతి త్వరలోనే కలుస్తానని చెప్పాడు. దీనితో రమణ గోగుల కూడా తప్పకుండా అంటూ రిప్లై ఇచ్చాడు. అంటే ఇదంతా చూస్తుంటే డెఫినెట్ గా గట్టి ట్రీట్ కన్ఫర్మ్ అనిపించేలా ఉంది.