Nagababu: ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు అయ్యి ఏడాది అవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే అన్ని శాఖలకు మంత్రిని కేటాయించారు కానీ కేవలం ఒక్క శాఖకు మాత్రమే ఇప్పటివరకు మంత్రిని కేటాయించలేదని అయితే ఆ మంత్రి పదవి నాగబాబు కోసమే ఖాళీగా ఉంచారని ఇదివరకు వార్తలు వినిపించాయి. ఇక నాగబాబు ఎన్నికలలో ఎక్కడ పోటీ చేయలేదు కానీ ఈయనని ఎమ్మెల్సీగా తీసుకొని అనంతరం మంత్రిగా కేబినెట్ లోకి తీసుకోవాలని భావించారు.
నిజానికి నాగబాబు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉండగా పొత్తులో భాగంగా ఆస్థానం బిజెపికి వెళ్లిపోవడంతో నాగబాబు ఎన్నికలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన మాత్రం కూటమి ప్రభుత్వం గెలవడానికి ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న అన్ని ప్రాంతాలలో కూడా తమ పార్టీని గెలిపించుకోవడం కోసం కృషి చేశారు. ఇలా జనసేన పార్టీ కోసం ఎంతగానో కష్టపడినా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వటం జరిగింది.
ఇలా ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఈయనని మంత్రిగా నియమించి క్యాబినెట్ లోకి తీసుకోవాలని భావించారు అయితే ఈ మంత్రి పదవి ఇవ్వటానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఉగాది పండుగను పురస్కరించుకొని నాగబాబు మంత్రిగా బాధ్యతలు తీసుకొని క్యాబినెట్ లోకి అడుగు పెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు మాత్రం ఆ సమయం రానేలేదు. ఈయన ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసి కూడా దాదాపు రెండు నెలలు పూర్తి అవుతుంది. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది.
నాగబాబు కోసమే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలి, ఇలా మంత్రివర్గ విస్తరణ చేపడితే ఎంతో మంది సీనియర్ నేతలు తమకు మంత్రి పదవులు కావాలనే డిమాండ్లు చేస్తున్నారట. అంతేకాకుండా జనసేనలో పవన్ కళ్యాణ్ కాకుండా ముగ్గురు మంత్రులు ఉండగా ఆ ముగ్గురిలో ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావటం గమనార్హం. ఇలా నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇస్తే అది కూడా కాపు వర్గానికి చెందిన వారికే దక్కుతుంది కాబట్టి ప్రజలలోకి తప్పు ఉద్దేశం వెళ్లే అవకాశాలు ఉంటాయని, అందుకే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అని సందిగ్ధంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఇలా వీరి ఆలోచనలు చూస్తుంటే నాగబాబుకు మంత్రి పదవి వచ్చేలా కనపడటం లేదని చెప్పాలి.