తెలుగు సినిమా ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి అభిమానుల్లో కొలిచే ఇండస్ట్రీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వీర భక్తుల్లో అయితే మొదటగా గుర్తుకొచ్చేది ఎవరైనా ఉన్నారు అంటే అది బండ్ల గణేష్ అనే చెప్పాలి.
మరి బండ్ల గణేష్ అయితే పవన్ ని ఏ రేంజ్ లో పొగుడుతాడో.. ఏ రేంజ్ లో ఆరాధిస్తాడో కూడా తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి బండ్ల గణేష్ అయితే పవన్ పాలిటిక్స్ పై ఎప్పుడు కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేస్తూ ఉంటాడు.
అలాగే గత కొన్నాళ్ల కితం కూడా అవకాశం ఉంటే పవన్ పార్టీలోకి వస్తా అని హింట్స్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అయితే ఇక పాలిటిక్స్ పై ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు చేసిన పోస్ట్ సినీ సహా రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి తాను మాట్లాడుతూ
“నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు” అంటూ క్లియర్ కట్ క్లారిటీ ని అయితే బండ్ల గణేష్ ఇచ్చారు. మరి దీనితో అయితే పవన్ ఫ్యాన్స్ కొద్దిగా హర్ట్ అయ్యినా ఇంకొందరు అయితే బండ్ల దూరంగానే ఉంటేనే బెటర్ అని అంటున్నారు.
నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు….2
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022