ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2019 లో ఆంధ్రాలో ఎన్నికల హీట్ హీట్ గా సాగుతున్న సమయంలో తనదైన కామెడీ రాజకీయంతో నవ్వులు పండించే ప్రయత్నం చేశాడు. అయితే 2019 ఎన్నికల్లో తన పార్టీ తరుపున ఎవరెవరు పోటీచేస్తున్నారో అనే విషయం కూడా తెలుసుకోలేక, ఆ ఎన్నికల్లో నోటా కంటే అనేక రేట్లు తక్కువ సంఖ్యలో ఓట్లు తెచ్చుకున్న కేఏ పాల్ ఆ తర్వాత రాజకీయాలు దూరంగా వెళ్ళిపోయాడు. తాజాగా మరోసారి పొలిటికల్ సీన్ లోకి వచ్చిన పాల్ ఈ సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు జరిగింది.
“2008లో ప్రజారాజ్యం పెట్టి, ఎంపీ పోస్టు తీసుకొని కాంగ్రెస్ లో విలీనం అయ్యారు. 2013లో మోదీ వెనక తిరిగి, ఆయన ఎంపీ సీటు ఇస్తారని ఆయనకు ప్రచారం చేశారు. ఆయన సీటు ఇవ్వలేదు. మోదీ సీటు ఇవ్వలేదని 2019లో మాయావతి పాదాల మీద పడ్డారు. ఇప్పుడు మళ్లీ గతంలో తిట్టిన బీజేపీతోనే చేరారు. ఇన్ని పార్టీలు మారుతుంటే ఏమైనా విలువ ఉంటుందా? ఇలా అమ్ముడుపోవడం మీ అభిమానులకు ఎంత విచారకమైన విషయమో తెలుసా?” పవన్ కు ఎంపీ సీటు అంటే మోజు ఎక్కువని, కేవలం ఆ ఒక్క ఎంపీ సీటు కోసమే ఇన్ని పార్టీల్ని, ఇన్ని సార్లు మారారని విమర్శించారు. బడుగు-బలహీన వర్గాల పేరిట ఇలా మోసం చేయకూడదని… ఓ పార్టీకి విధివిధానం, పాలసీ ఉండాలని.. పవన్ ఇలా చేయడం విచారకరం అంటూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకొని పాల్ విమర్శలు చేశాడు ..
2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తనతో కలిస్తే ఎన్నికల్లో ఆశీర్వాదం అందిస్తానని, ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. కానీ పవన్ మాత్రం కేఏ పాల్ కు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ చేసిన అతి పెద్ద తప్పు, తనతో చేతులు కలపకపోవడమేనని గతంలో కేఏ పాల్ వ్యాఖ్యానించారు. విచిత్రమేమిటంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలంటే కేఏ పాల్ రాజకీయమే చాలా వరకు బెటర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇక ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ వ్యాఖ్యలపై పాపం జనసైనికులు ఏడవలేక నవ్వే పరిస్థితి ఏర్పడింది.