పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన పరిటాల సునీత..

ఈ మధ్య పలువురు రాజకీయ నాయకులు పోలీసులపై అనవసరంగా వాదనలకు దిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో మంత్రి కూడా పోలీసులతో వాదనకు దిగారు. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ఈరోజు ఆవిడ పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు భారీ కాన్వాయ్ తో వెళ్తుండగా రామగిరి వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో సునీతతో పాటు తన కొడుకు శ్రీరామ్ కూడా పోలీసులపై వాగ్వాదానికి దిగాడు. ఇక సి ఐ, నాలుగు వాహనాల్లో వెళ్లాలని సూచించినా కూడా వాళ్ళు అలాగే ప్రవర్తించడంతో ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ గా మారింది.