తెలుగు రాజకీయాల గురించి తెలిసిన వాళ్లకు పరిటాల కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ రాజకీయాలను పరిటాల కుటుంబం ఒక దశలో ఏలిందని చెప్పవచ్చు. పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉండేవారు. ఆయన అప్పటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ కు చాలా సన్నిహితంగా ఉండేవాడు. పరిటాల రవీంద్రను కలవడానికి, రవీంద్రతో మాట్లాడటానికి, రవీంద్రతో పరిచయం పెంచుకోవడానికి పెద్ద పెద్ద నేతలు సైతం పోటీపడేవారు. అయితే ఇప్పుడు పరిటాల కుటుంబాన్ని రాయలసీమలో ఎవ్వరు పట్టించుకోవడం లేదు.
రవీంద్ర పరువును శ్రీరామ్ తీస్తున్నాడా!
తెలుగుదేశం పార్టీలో కానీ రాయలసీమ రాజకీయాల్లో కానీ పరిటాల రవీంద్రకు చాలా గౌరవం ఉండేది. ఆయనకు అన్న ఎన్టీఆర్ సైతం గౌరవం ఇచ్చేవారు. అయితే ఆయన మరణించిన తరువాత సునీత రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల్లో పల్నాడు నుండి ఎమ్మెల్యేగా గెలవడంతో చంద్రబాబు నాయుడు ఆమెను మంత్రి వర్గంలోకి తీసుకున్నాడు. ఇదిలా ఉండగా 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పల్నాడు నుండి పరిటాల శ్రీరామ్ పోటీ చేశారు. ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఘోర పరాజయాన్ని పొందారు. వచ్చిన మొదటి అవకాశాన్ని శ్రీరామ్ సరిగ్గా ఉపయోగించుకోలేపోయారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పరిటాల రవీంద్రకు ఉన్న పరువును శ్రీరామ్ పోగొట్టేలా ఉన్నాడని రాయలసీమ ప్రజలు చర్చించుకుంటున్నారు.
విమర్శలను కూడా శ్రీరామ్ ఎదుర్కోలేడా!
ఎన్నికల్లో ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత శ్రీరామ్ కనీసం బయటకు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోవడం మనేశారని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే పరిటాల కుటుంబంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అమరావతిలో పరిటాల కుటుంబానికి కూడా భూములు ఉన్నాయని వైసీపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నా కూడా పరిటాల శ్రీరామ్ ఖండించడం లేదు. ఇలా శ్రీరామ్ మౌనంగా ఉండటంపై టీడీపీ నేతలు కూడా కోపంగా ఉన్నారని సమాచారం.