Suicide: యువత ప్రస్తుత కాలంలో ఏ విషయానికైనా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమాజంలో విషయాల గురించి సరైన అవగాహన లేక క్షణికావేశంలో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిని ఎదుర్కొని సమస్యని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయకుండా ఆ సమస్యకు లొంగిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లితండ్రుల ఆలోచనలకు గౌరవం ఇవ్వకుండా వారికి తోచినట్టు వారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి బాధాకర సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగళపల్లిలో ఈ సంఘటన జరిగింది. గ్రామంలో నివాసం ఉంటున్న సుదర్శన్‌రెడ్డి-మణెవ్వ దంపతులకు శ్రుతి(24) చిన్న కూతురు. ఆమెకు ఉన్నత చదువులు చదవాలని చాలా కోరిక. శ్రుతి డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఇంట్లో ఉంటోంది. తనకి పీజీ చదవాలని ఉందని తల్లితండ్రులను కోరింది. అయితే కూతురు ఉన్నత చదువులు చావడానికి సుదర్శన్ రెడ్డి అంగీకరించలేదు.
పీజి చేస్తానని కూతురు ఎంత బ్రతిమలాడి తండ్రి ఒప్పుకోకపోవడంతో మనస్థాపానికి గురయింది.
శ్రుతి తల్లితండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగా వారు పనులు చేసుకోవటానికి వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రుతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం తల్లితండ్రులు ఇంటికి వచ్చి చూసే సరికి శ్రుతి దూలానికి వేలడుతూ శవమై కనిపించేసరికి ఆ తల్లితండ్రులు ఒక్కసారిగా బోరున విలపించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.