తెలుగులో వస్తున్న తమిళ బ్లాక్ బస్టర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే!

తమిళ్ బ్లాక్ బస్టర్ డా.. డా సినిమాని తెలుగులో పా..పా టైటిల్ తో జెకె ఎంటర్టైన్మెంట్ నీరజ కోట విడుదల చేయబోతున్నారు. తమిళంలో ఈ సినిమాని ఒలంపియా మూవీస్ సంస్థ ఎస్ అంబేద్కర్ సమర్పించారు. తండ్రి కొడుకుల సెంటిమెంటుతో తెరకెక్కి తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో జనవరి 3న ఆంధ్ర తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత ఏడాది తమిళంలో విడుదలైన డా.. డా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కవిన్, అపర్ణ దాస్ ప్రధానపాత్రలుగా డాక్టర్ గణేష్ బాబు తెరకెక్కించిన ఈ చిత్రం కోలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసింది.

హార్ట్ టచ్ అయ్యే పాటలు ఈ సినిమాకు మరో హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పటి పాపులర్ సాంగ్స్ మాదిరిగానే ఈ సినిమా పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయంటున్నారు చిత్ర యూనిట్. తండ్రీ కొడుకుల సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుందని విశ్వాసాన్ని తెలియజేశారు నిర్మాత నీరజ కోట.

జనవరి 3న విడుదలయ్యే ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుదల చేయబోతున్నారు. జెన్ మార్టిన్ సంగీతం అందించిన ఈ సినిమాకి రవివర్మ ఆకుల సాహిత్యం అందించారు. కడలి రాంబాబు, అశోక్ దయ్యాల వీఆర్వోలుగా పనిచేశారు. ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో కవిన్, అపర్ణ దాస్ తో పాటు మౌనిక చిన్న కోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజా, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు.

PaPa Telugu Movie Official Trailer