Prabhas: ప్రభాస్ చేతికి సర్జరీ.. సర్జరీ కోసం త్వరలోనే యుఎస్ వెళ్లనున్న పాన్ ఇండియా హీరో!

Prabhas: సినిమా హీరోలు అంటే కొంతమందికి ఒక విధమైన అభిప్రాయం ఉంటుంది. వారు ఎలాంటి కష్టం లేకుండా కోట్లు సంపాదిస్తూ ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని చాలామంది భావిస్తారు. అయితే ఆ జీవితం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. సినిమా షూటింగ్ కోసం ఎన్నో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. రాత్రి పగలు అని తేడా లేకుండా నిరంతరం షూటింగ్ లొకేషన్ లో పాల్గొంటూ కష్టపడితేనే వారికి అలాంటి ఫలితం దక్కుతుందనే విషయం మనకు తెలిసిందే.అయితే ఇలా షూటింగ్ సన్నివేశాలు జరిగేటప్పుడు కొన్ని ప్రమాద సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి.

ఈ సంఘటనలన్నింటినీ తట్టుకొని ప్రేక్షకులను సందడి చేయడానికి మన ముందుకు వస్తున్నారు.ఈ విధంగా ఎంతో మంది సినీ ప్రముఖులు పలు సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదాల బారిన పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చిరంజీవి, బాలకృష్ణ ,మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ అందరు కూడా గత కొద్ది రోజులుగా సర్జరీలు చేయించుకున్న వారే. తాజాగా మరొక హీరో కూడా సర్జరీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ సర్జరీ చేయించుకోవాలని భావించారట. ఈ సర్జరీ నిమిత్తం ప్రభాస్ త్వరలోనే యూఎస్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఇలా టాలీవుడ్ హీరోలకి ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.