గ్రేటర్ ఎన్నికల్లో విజేత ఎవరో డిసైడ్ చెయ్యబోతోన్న ఒవైసీ – కరక్ట్ టైమ్ లో చావుదెబ్బ కొట్టాడు !

owaisi is the king maker in greater elections

తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం కీలకంగా మారనుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ లు ఎక్కువ స్థానాలు సాధించే అవకాశాలున్నాయితెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం కీలకంగా మారనుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ లు ఎక్కువ స్థానాలు సాధించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న విశ్లేషణలు, అంచనాల ప్రకారం బీజేపీకి మేయర్ పదవిని దక్కించుకునే పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు. గతంలో కన్నా సీట్ల సంఖ్యను పెంచుకుని టీఆర్ఎస్ కు మాత్రం బీజేపీ సవాల్ విసరగలదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

owaisi is the king maker in greater elections
Asaduddin owaisi

అయితే టీఆర్ఎస్, ఎంఐఎం లు ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. వీరి మధ్య ఎలాంటి పొత్తులు లేవని రెండు పార్టీల అగ్రనేతలు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 డివిజన్లు ఉండగా ఎంఐఎం 52 స్థానాలలో మాత్రమే పోటీ చేస్తుంది. తమకు బలమున్న ప్రాంతాల్లోనే ఎంఐఎం పోటీకి దిగుతుంది. గత ఎన్నికల్లో నలబై స్థానాలను దక్కించుకున్న ఎంఐఎం ఆ స్థానాలను తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.అయితే కొన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల పైన కూడా ఎంఐఎం బరిలోకి దిగుతుంది. అయితే అది నామమాత్రపు పోటీయేనని బీజేపీ, కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నాయి. పాత బస్తీలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ ఎంఐఎం మీద నామ్ కే వాస్తేగా కొందరిని పోటీకి దింపగా, మిగిలిన ప్రాంతాల్లో ఎంఐఎం కూడా టీఆర్ఎస్ మీద నామమాత్రపు పోటీకి దింపిందంటున్నారు. రెండు పార్టీల మధ్య పూర్తి అవగాహన తోనే ఎన్నికల బరిలోకి దిగాయంటున్నారు.

కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎంఐఎం ఈ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశముంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 99 డివిజన్లు, ఎంఐఎంకు 40 డివిజన్లు వచ్చాయి. అయితే టీఆర్ఎస్ కు ఈసారి అన్ని డివిజన్లు వచ్చే అవకాశం లేదు. మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ ఖచ్చితంగా ఎంఐఎం మీద ఆధారపడక తప్పదు. అయినా రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం బయటకు మాత్రమేనని లోపాయికారీ ఒవ్పందం కుదరిపోయిందని బీజేపీ విమర్శలు చేస్తుంది. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.