‘కాంతార’ చిత్రానికి ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఊహించని షాక్..!

‘కాంతార’ చిత్రం తెలుగులో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే! రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిపెను తుపానునే సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలయి.. నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కన్నడ నుంచి వచ్చిన ఈ ‘కాంతార’ గొప్ప విజయాన్ని సాధించి వాహ్.. అనిపించింది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేశారు. కన్నడతో పాటు.. తెలుగులో కూడా ఈ ‘కాంతార’ చిత్రం మంచి రాబడిని సాధించుకుని ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంది.

సౌత్ ఇండియా సినిమాతో సహా పాన్ ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టిన ‘కాంతార’ విమర్శకుల ప్రశంసలు పొందింది. కన్నడ, తెలుగుతో పాటు, హిందీ భాషలో కూడా విడుదలై భారీ వసూళ్లునే అందుకొని 400 కోట్లకి చేరుకోవడం విశేషమే అని చెప్పాలి. ‘కాంతార’ సినిమాను కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించారు. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. అక్టోబర్ 15న తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను సాధించింది. ‘కాంతార’ చిత్రం ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందోనని చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 24 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట ఫాం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే ‘కాంతార’ ఓటీటీ రిలీజ్‌లో అభిమానులకు మేకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు.

ఈ సినిమాకి సోల్ అయినటివంటి వరహా రూపం సాంగ్ ని మార్చి ఇందులో పెట్టడం ఒకొక్కరికి షాకింగ్ గా మారింది. దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ఇదే చర్చ నడుస్తుంది. థియేటర్స్ లో ఉన్న సాంగ్ ఇప్పుడు లేదని పెద్ద చర్చ నడుస్తుంది. అయితే కాంతార ఓటీటీ రిలీజ్‌లో అభిమానులకు మేకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ సినిమాకి సోల్ అయినటివంటి వరహా రూపం సాంగ్ ని మార్చి ఇందులో పెట్టడం ఒకొక్కరికి షాకింగ్ గా మారింది. దీనితో సోషల్ మీడియాలో అంతా ఇదే చర్చ ఇప్పుడు నడుస్తుంది. థియేటర్స్ లో ఉన్న సాంగ్ ఇప్పుడు లేకపోవడంతో అందరూ పెదవి విరుస్తున్నారు. అయితే ఈ సాంగ్ ఇది వరకే కన్నడ నుంచి ఐదేళ్ల క్రితమే ఒరిజినల్ బీట్ ఉండగా దాని కాపీ రైట్ ఇష్యూ తో ఇప్పుడు ఈ ట్యూన్ ని మేకర్స్ పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఇక ‘కాంతార’లో హీరోయిన్ గా సప్తమి గౌడ నటించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఇది ఇలా ఉండగా.. కాంతార’ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. మరోవైపు కాంతార సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ కు భారీ ఆఫర్ వచ్చింది.

తెలుగులో కాంతార మరో రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల్ని కొనుగోలు చేసినందుకు ప్రముఖ ఛానల్స్ భారీగానే పోటీ పడ్డాయి. ఫైనల్’గా స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకుంది. మొత్తం 4.5 కోట్ల రూపాయలకు స్టార్ మా కాంతార శాటిలైట్ రైట్స్ చేజిక్కించుకుంది. అయితే ‘కాంతార’ సినిమా చుట్టూ ఉన్న ఒకేఒక్క వివాదానికి తాజాగా తెరపడింది. ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచిన ‘వరాహ రూపం’ పాట సినిమాలో ప్రదర్శించరాదంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కేరళ హైకోర్టు కొట్టేసింది. ‘కాంతార’ సినిమాలో బాగా పాపులర్ అయిన ‘వరాహ రూపం’ పాటను థియేటర్లలో ప్రదర్శించరాదంటూ కేరళ కోర్టు గతంలో తీర్పునిచ్చింది. తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ అనుమతి లేకుండా ఆ పాటను థియేటర్లలో ప్రదర్శించకూడదని కొజికొడె జిల్లా సెషన్స్ జడ్జ్ తీర్పునిచ్చారు.