ఓటిటి లో పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ ఎప్పుడు నుంచి అంటే..!

తమిళ సినిమా నుంచి ఈ ఏడాది వచ్చిన భారీ హిట్ చిత్రాల్లో ఇండియాస్ టాప్ దర్శకుడు అయినటువంటి మణిరత్నం తెరకెక్కించిన భారీ చిత్రం “పొన్నియిన్ సెల్వన్” కూడా ఒకటి, హీరో విక్రమ్, కార్తీ తదితర స్టార్స్ సహా ఐశ్వర్య రాయ్ మరియు త్రిష లాంటి స్టార్ హీరోయిన్ లు నటంచిన భారీ పీరియాడిక్ డ్రామా అయినటువంటి పొన్నియిన్ సెల్వన్ 1 దాదాపు 450 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న సినిమాగా ఇది నిలిచింది.

ఇక ఈ సినిమా తమిళ్ భాష లో ఇప్పటికీ కూడా మంచి రన్ ని కొనసాగిస్తోంది. ఇక ఈ చిత్రం అయితే ఓటిటి లో ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమేజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేయగా దీనిని అయితే ఇందులో ఈ చిత్రం ఈ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.

మరి ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు ప్రైమ్ వీడియో వారే సొంతం చేసుకోగా అన్ని ఆ అన్ని భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమ్ కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అయితే వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తుండగా ఈ చిత్రానికి అయితే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే లైకా ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.