తెలుగులో “కాంతారా” హిట్టు..తమిళ ఇండస్ట్రీకి చెంపపెట్టు..!

కొన్ని సినిమాల ఫలితాలు సైలెంట్ గా స్టార్ట్ అయినా కూడా తర్వాత బాక్సాఫీస్ దగ్గర వాటి ఫలితాలు చాలా వైలెంట్ గా ఉంటాయి. అలా గత కొన్ని నెలల కితం హిందిలో చిన్న స్టార్ట్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రం “కాశ్మిర్ ఫైల్స్”. చాలా తక్కువ బడ్జెట్ లోనే వచ్చిన వండర్స్ సెట్ చేసిన ఈ చిత్రం తరవాత మళ్ళీ తక్కుబ బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చి భారీ వసూళ్లు అందుకున్న చిత్రంగా శాండిల్ వుడ్ హిట్ చిత్రం “కాంతారా” నిలవడం ఆసక్తిగా మారింది.

రిలీజ్ అవ్వడమే భారీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫలితం ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీకి చెంపపెట్టు లా మారింది అని చెప్పి తీరాలి. ఓపెన్ గా కొన్ని ఫాక్ట్ లు చెప్పాలి అంటే తమిళ సినిమాలు కానీ తమిళ హీరోలని కానీ మన తెలుగు ఆడియెన్స్ ఆదరించినట్టుగా అక్కడి జనం ఆదరించరు.

ఏవో కొన్ని భారీ హైప్ ఉన్న సినిమాలు మినహా మిగతా ఏ హీరో సినిమాకి కూడా సరైన వసూళ్లు కూడా అక్కడ నుంచి ఇవ్వరు. కానీ రీసెంట్ గా వారి పొన్నియిన్ సెల్వన్ సినిమా విషయంలో తమిళ జనం మన తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులపై రివర్స్ కామెంట్స్ చేసారు.

ఆ సినిమాలో తెలుగులో సరైన వసూళ్లు అందుకోకపోవడంతో తెలుగు వాళ్ళకి సినిమాలు చూడడమే రాదు అనేసారు. ఆ సినిమాలో తెలుగు ఆడియెన్స్ ని మెప్పించే రేంజ్ కంటెంట్ లేకపోతె మనం మాత్రం ఏం చేస్తాం.. సరిగ్గా ఇప్పుడే వచ్చిన “కాంతారా” కన్నడ నుంచి డబ్ అయ్యి తెలుగులో భారీ వసూళ్లు అందుకుంటుంది.

దీనితో ఈ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి తెలుగులో ఆదరించారు అని అందుకు వసూళ్లే నిదర్శనం అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. అంతే కాకుండా ఇది కూడా పర భాషా సినిమానే అయినా కూడా కన్నడ కన్నా ఎక్కువ ఓపెనింగ్స్ మేము అందించాం తమిళ ఇండీస్ట్రీ వాళ్ళు ఇది తెలుసుకోవాలి అని అంటున్నారు.

మరి ఇదే కాంతారా తమిళ్ వెర్షన్ కి తమిళ జనం ఎంత వసూళ్లు ఇచ్చారు అనే ప్రశ్న కూడా వారికి ఎదురు కాగా ఒక్కరి నుంచి కూడా సమాధానం లేదు.. ఇది మన తెలుగు ఆడియెన్స్ అంటే.